వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: మహిళ ఎస్ఐ‌పై లైంగిక వేధింపులు, తుపాకీ గురిపెట్టి ఇలా..

By Narsimha
|
Google Oneindia TeluguNews

విదిశా: సాధారణ మహిళలనే కాదు, ఏకంగా ఓ మహిళా ఎస్ఐ‌పై దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మహిళలపై అత్యాచారాలు, దాడులు , దౌర్జన్యాలను అరికట్టేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలనే కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ముఖ్యంగా మైనర్‌ బాలికలపై అత్యాచారం చేస్తే మరణ శిక్ష లాంటి కఠిన చట్టాలను ప్రభుత్వం తీసుకు వచ్చినా అత్యాచారాలు మాత్రం తగ్గడం లేదు.

మధ్యప్రదేశ్‌లో మహిళా ఎస్ఐపై లైంగిక వేధింపులు

మధ్యప్రదేశ్‌లో మహిళా ఎస్ఐపై లైంగిక వేధింపులు

మధ్యప్రదేశ్‌లోని విదిశా పట్టణంలో ఒక మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ని ముగ్గురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆమెను అతి దారుణంగా వేధించారు. అంతేకాదు ఆమెను నోటికొచ్చినట్టు తిట్టారు. తీవ్రంగా హింసించారు.

 తుపాకీ గురిపెట్టి లైంగిక వేధింపులు

తుపాకీ గురిపెట్టి లైంగిక వేధింపులు

మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తలదగ్గర తుపాకి పెట్టి మరీ అత్యంత దారుణంగా, క్రూరంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.ఆమెను రాయడానికి వీల్లేని భాషలో బూతులు తిట్టారు. చంపేస్తామని బెదిరించారు.

బాధిత మహిళా ఎస్ఐ ఫిర్యాదు

బాధిత మహిళా ఎస్ఐ ఫిర్యాదు

ఈ ఘటనపై బాధిత మహిళ ఇన్స్‌పెక్టర్ ఫిర్యాదు చేశారు. నిందితుల పూర్తి వివరాలను అందజేశారు. నిందితులు ఏ రకంగా వ్యవహరించారో ఫిర్యాదులో వివరించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

 నిందితుల అరెస్ట్

నిందితుల అరెస్ట్

మహిళా ఎస్ఐ ను లైంగిక వేధింపులకు గురిచేసిన ముగ్గురు నిందితులను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఈ రాష్ట్రంలో లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలకు పాల్పడిన కఠినంగా శిక్షలు వేసేలా చట్టాలను తయారు చేశారు. అయితే ఈ చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడ నిందితుల్లో మాత్రం పరివర్తన రాలేదు. పోలీసు అధికారిపైనే లైంగిక వేధింపులకు పాల్పడడం దారుణమని మహిళా సంఘాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

English summary
Three people have been arrested for allegedly molesting and threatening a woman police sub-inspector at gun-point in Madhya Pradesh's Vidisha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X