Madhya Pradesh Polls: మధ్యప్రదేశ్ లో తెరపైకి కాంగ్రెస్ పాత అస్త్రం-82 ఎస్సీ, ఎస్టీ సీట్లపై ప్రభావం..

మధ్యప్రదేశ్ లో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. హిందీ హార్ట్ ల్యాండ్ గా చెప్పుకునే రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ లో గెలిస్తే వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు పాజిటివ్ గా మారుతుందని ఇరు పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ఓట్లు కీలకంగా మారాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ రెండు వర్గాల్ని పూర్తిగా తమవైపు తిప్పుకునేందుకు పాత అస్త్రాన్ని తెరపైకి తెస్తోంది.

మధ్యప్రదేశ్ లో ఈసారి గెలుపు కోసం కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. గతంలో 2018లో గెలిచినా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా అధికారం కోల్పోయిన కాంగ్రెస్.. ఈసారి మాత్రం ఆ పరిస్ధితి పునరావృతంకాకుండా బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం తమ సంప్రదాయ ఓటు బ్యాంకు అయిన ఎస్సీ, ఎస్టీల కోసం రెండు దశాబ్దాల క్రితం తాము ప్రకటించిన చారిత్రక భోపాల్ డిక్లరేషన్ ను తెరపైకి తెస్తోంది.

MP Assembly Elections: congress brings back bhopal declaration to capture SC, ST votes

తమకు ఈసారి అధికారం ఇస్తే భోపాల్ డిక్లరేషన్ ను తప్పనిసరిగా అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది.ఇంతకీ ఈ భోపాల్ డిక్లరేషన్ లో ఎస్సీ, ఎస్టీల కోసం ఏం చెప్పారంటే ? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ కొనుగోళ్లు, కాంట్రాక్టులు, పదవుల విషయంలో కచ్చితంగా ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించింది. దీంతో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో ఠాకూర్ల హవాతో ఇవి దక్కని ఎస్సీ, ఎస్టీలు కచ్చితంగా తమవైపు మొగ్గుతారని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ తమ తాజా మ్యానిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల్ని పారిశ్రామిక వేత్తల్ని చేస్తామని హామీ ఇచ్చింది. ఇందుకోసం కోటి రూపాయల వరకూ ఉండే కాంట్రాక్టుల్లో 25 శాతం వారికే కేటాయిస్తామని తెలిపింది. 2002లో కాంగ్రెస్ పార్టీ దిగ్విజయ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన భోపాల్ డిక్లరేషన్ లో ఇది కూడా భాగమే. ఈ డిక్లరేషన్ లో కొన్ని హామీల్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేసి చూపించింది. దీంతో ఇప్పుడు భోపాల్ డిక్లరేషన్ అమలు హామీకి ప్రాధాన్యం లభిస్తోంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలోని 230 సీట్లలో 35 ఎస్సీ, 47 ఎస్టీ సీట్లు ఉన్నాయి. దీంతో ఈ 82 సీట్లకు గురిపెట్టి కాంగ్రెస్ ఈ హామీ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+