• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొలిటికల్ టర్న్ : 24 ఏళ్ల శత్రుత్వానికి బ్రేక్.. ఒకే వేదికపై ములాయం, మాయావతి

|
Google Oneindia TeluguNews

మైన్‌పురి : రెండు దశాబ్ధాల రాజకీయ వైరం. 24 ఏళ్లుగా ఎడతెగని శత్రుత్వం. ఒకరి ముఖం మరొకరు కూడా చూసుకోనంతటి ద్వేషం. అలాంటి బద్ద శత్రువులు మళ్లీ ఒక్కటయ్యారు. ఒకే వేదికపై కనిపించి దరహాసం చిందించారు. గతం మరిచిపోయారు.. వర్తమానంపై దృష్టి పెట్టారు. వారెవరో కాదు ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి. రాజకీయాల్లో అసాధ్యమంటూ ఏదీ ఉండదు అనడానికి వీరిద్దరి మధ్య మళ్లీ చిగురించిన దోస్తానా పెద్ద ఉదహరణ.

<strong>ఇల్లు కట్టుకునేవారికి గుడ్ న్యూస్..! బిల్డింగ్ ప్లాన్ ఫ్రీ.. 48 గంటల్లో అనుమతి</strong>ఇల్లు కట్టుకునేవారికి గుడ్ న్యూస్..! బిల్డింగ్ ప్లాన్ ఫ్రీ.. 48 గంటల్లో అనుమతి

చిగురించిన స్నేహం

చిగురించిన స్నేహం

వైరం సమసిపోయింది. కొత్త దోస్తానా చిగురించింది. 24 ఏళ్ల నుంచి కొనసాగిన శత్రుత్వం ఒక్కసారిగా పటాపంచలైంది. ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఒకే వేదికపై కనిపించడంతో వారి మధ్య ఉన్న రెండు దశాబ్ధాల మౌనానికి ఫుల్ స్టాప్ పడింది.

1995లో మాయావతితో పాటు బీఎస్పీ కార్యకర్తలపై సమాజ్ వాదీ పార్టీ శ్రేణులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఇక అప్పటినుంచి ఇరు పార్టీల అధినేతల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. అలా రెండు దశాబ్ధాల నుంచి వారి మధ్య మాటల్లేవు. కానీ 24 ఏళ్లు కలలా గడిచిపోయాయి. లోక్ సభ ఎన్నికల పుణ్యమా అని తిరిగి ఈ ఇద్దరు రాజకీయ ఉద్ధండులు మళ్లీ ఒక్కటయ్యారు.

ఒకే వేదికపై అగ్రనేతలు..పార్టీశ్రేణుల్లో ఆనందం

ఒకే వేదికపై అగ్రనేతలు..పార్టీశ్రేణుల్లో ఆనందం

ఎస్పీ చీఫ్, బీఎస్పీ అధినేత రాకతో మైన్‌పురి క్రిస్టియన్ ఫీల్డ్ మైదానం కళకళలాడింది. 24 ఏళ్ల తర్వాత ఇద్దరు అగ్రనేతలు ఒకే వేదికపై దర్శనమివ్వడంతో.. ఇరు పార్టీల కార్యకర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ములాయం, మాయావతి కలిసి అభివాదం చేయడంతో పెద్దపెట్టున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

మైన్‌పురి లోక్ సభ సెగ్మెంట్ నుంచి ములాయం పోటీ చేస్తున్నారు. ఆ క్రమంలో శుక్రవారం (19.04.2019) నాడు ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమి ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ములాయం, మాయావతితో పాటు ఆర్‌ఎల్డీ చీఫ్‌ అజిత్‌ సింగ్‌ కూడా సభలో పాల్గొన్నారు.

మాయావతిని గౌరవిద్దాం

మాయావతిని గౌరవిద్దాం

సభా వేదికపై ములాయం సింగ్ కాస్తా భావోద్వేగానికి గురయ్యారు. రెండు దశాబ్ధాల తరువాత మాయావతితో కలిసి ఇలా ప్రజల ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇకనుంచి సమాజ్‌వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలు బీఎస్పీ అధినేత్రి మాయావతిని గౌరవించాలని పిలుపునిచ్చారు. ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని సభాముఖంగా కోరారు.

 ములాయంను భారీ మెజార్టీతో గెలిపించండి

ములాయంను భారీ మెజార్టీతో గెలిపించండి

ఈ వేదికపై మాయావతి మాట్లాడుతూ.. మైన్‌పురి నుంచి ములాయం సింగ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
వెనుకబడిన వర్గాలు ములాయంను తమ నేతగా భావిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఒకటికి పదిసార్లు ఆలోచించి సమర్థులెవరో, అసమర్థులెవరో తెలుసుకుని ఓటేయాలన్నారు. అఖిలేష్ యాదవ్.. ములాయంకు అసలు సిసలు వారసుడని కితాబిచ్చారు.
దేశ భవిష్యత్తు కోసమే ఎస్పీ, బీఎస్పీ పొత్తు పెట్టుకున్నాయని స్పష్టం చేసిన మాయావతి.. ప్రధాని మోడీ నాటకాలు ఈసారి ఎన్నికల్లో పనిచేయవని ఎద్దేవా చేశారు.

 మైన్‌పురి నుంచే ఢిల్లీకి అడుగులు

మైన్‌పురి నుంచే ఢిల్లీకి అడుగులు

ఇక ములాయం తనయుడు అఖిలేశ్ యాదవ్ సభికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దేశానికి నూతన ప్రధాని అవసరం ఎంతో ఉందని.. దానికి మైన్‌పురి నుంచే అడుగులు పడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమి నుంచి కొత్త ప్రధాని కల సాకారమవుతుందని చెప్పుకొచ్చారు. వ్యవస్థలన్నింటినీ ప్రధాని మోడీ నిర్వీర్యం చేశారని.. దేశంలో బీజేపీని తుడిచిపెట్టడానికే తామంతా కూటమిగా ఏర్పడ్డామని అన్నారు.

English summary
Ending decades-long rivalry, Samajwadi Party patriarch Mulayam Singh Yadav and Bahujan Samaj Party chief Mayawati on Friday shared dais at an election rally in Mainpuri with the BSP president describing the SP patron as a "real leader" of the backwards, unlike Prime Minister Narendra Modi whom she dubbed as "farzi".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X