ప్రవక్తపై కామెంట్స్ కలకలం.. నుపూర్‌కు సమన్లు ఇచ్చే యోచనలో ముంబై పోలీసులు

మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన కామెంట్లు అగ్గిరాజేశాయి. కామెంట్లపై నిప్పులు చెరుగుతున్నారు. బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు సమన్లు ఇచ్చేందుకు ముంబై పోలీసులు రెడీ అవుతున్నారు. రజా అకాడమీ ముంబై వింగ్ జాయింట్ సెక్రటరీ ఇర్ఫాన్ షేక్ ఫిర్యాదు మేరకు నుపుర్ శర్మపై దక్షిణ ముంబైలోని పైధోనీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

తనకు వచ్చిన ఓ మెసేజ్‌లో ట్విట్టర్ లింక్ ఉందని, దానిని ఓపెన్ చేసి చూసి షాకయ్యానని ఫిర్యాదులో పేర్కొన్నారు. అది ఓ టీవీ చర్చకు సంబంధించినదని, అందులో నుపుర్ మాట్లాడారని చెప్పారు. ముస్లింలు ఆరాధించే మహ్మద్ ప్రవక్త, ఆయన భార్య ఆయేషాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఇర్ఫాన్ షేక్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్నారు. ఆమెకు సమన్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. నుపుర్ కామెంట్స్ అంతర్జాతీయంగా కలకలం రేపాయి. బీజేపీ అధిష్టానం ఆమెతోపాటు మరో నేత నవీన్ కుమార్ జిందాల్‌ను కూడా పార్టీ నుంచి బహిష్కరించింది.

 Mumbai Police will summon Nupur Sharma

నుపుర్ కామెంట్లతో అరబ్ దేశాలు భారత్‌పై కోపంతో ఉన్నాయి. ప్రవక్త చేసిన కామెంట్లను ఖండించాయి. భారత్ సారీ చెప్పాలని.. అప్పటివరకు ఎగుమతి/ దిగుమతులు ఉండవని స్పష్టంచేశాయి. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు భారతదేశం ఎందుకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అడిగారు. ఈ మేరకు ప్రధాని మోడీకి ట్వీట్ చేశారు.

ఇటీవల జ్ఞాన్ వ్యాపి మసీదుకు సంబంధించి చర్చ జరిగింది. టీవీ డిబేట్‌లో నుపూర్ శర్మ.. మహ్మద్ ప్రవక్తపై తప్పుగా మాట్లాడారు. దీంతో వివాదం చెలరేగింది. దీంతో కాన్పూర్ హయత్ జఫార్ హస్మి కలుగచేసుకున్నారు. పోస్లర్లు, బ్యానర్లు అతికించి.. బంద్‌కు పిలుపునిచ్చారు. ముస్లింలను రెచ్చగొట్టి రాళ్లతో దాడి చేయడానికి ఉసిగొల్పారు. దీంతో రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. దీంతో 39 మంది.. పోలీసులు, జనం గాయపడ్డారు. అల్లర్లకు కారణమైన వారిపై గ్యాంగ్ స్టార్ యాక్ట్, ఆస్తుల నష్టం చట్టం విధిస్తామని తెలిపారు. శాస్త్రీయ, సాంకేతిక ఆధారంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. భద్రత కోసం పీఏసీ 12 కంపెనీలు, సీఏపీఎఫ్ 3 కంపెనీల సాయం తీసుకున్నామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+