'రామాలయం కూల్చేసి మసీదు కట్టారు, ముస్లీంలు సహకరించాలి'

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయం నిర్మించేందుకు ముస్లీంలు సహకరించాలని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి గురువారం విజ్ఞప్తి చేశారు. ఆర్కియాలజిస్టులు చేసిన సర్వేలో బాబ్రీ మసీదు స్థానంలో అంతకుముందు రామాలయం ఉన్నట్లు తేలిందని చెప్పారు.

కాబట్టి ముస్లీంలు రామాలయ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వివాదాస్థలంలో రామాలయం ఆనవాళ్లు ఉన్నట్లు కోర్టు కూడా 2003లో చెప్పిందన్నారు. రామాలయం కూల్చేసి, మసీదును కట్టారని తేలిందన్నారు. చాలాకాలంగా హిందువులు ఈ ఆలయ నిర్మాణం కోసం డిమాండ్ చేస్తున్నారని చెప్పారు.

subramanian swamy

పరస్పరం చర్చల ద్వారా రామాలయం నిర్మిస్తామని, దానికి అంగీకరించకుంటే 2018లో చట్టం తీసుకు వచ్చి రామాలయాన్ని నిర్మిస్తామని చెప్పారు. ముస్లీం కమ్యూనిటీ రామాలయం విషయంలో ముందుకు వస్తే ప్రశంసిస్తామన్నారు. 2024 వరకు అన్ని వివాదాలు ముగిసిపోతాయని ఆకాంక్షించారు.

కాగా, రామ జన్మభూమి - బాబ్రీ మసీదు వివాద పరిష్కారానికి ముస్లిం సంస్థలే అడ్డంకులు కల్పిస్తున్నాయని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఆరోపించారు. కోర్టు వెలుపల చర్చలద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సుప్రీం మంగళవారం చేసిన సూచనపై ముస్లిం సంస్థలు స్పందించిన తీరును తప్పుపట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP leader Subramanian Swamy on Thursday urged the Muslim community to support construction of the Ram Temple at the disputed Ram Janmabhoomi-Babri Masjid site in Ayodhya.
Please Wait while comments are loading...