హర్యానా కేబినెట్ లో సైనీతో పాటు 10 మంది మంత్రులు ? లిస్ట్ లో వీరే..
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ముఖ్యమంత్రిగా గత సీఎం నాయబ్ సింగ్ సైనీనే ఎంచుకుంది. దీంతో ఆయన ఇవాళ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు ఆయనతో పాటు 10 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.వీరిలో బీజేపీతో పాటు మిత్రపక్షాల ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
పంచకులలో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో నాయబ్ సింగ్ సైనీని నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దీంతో ఆయన ఇవాళ సీఎంగా మరోసారి ప్రమాణం చేస్తారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనతో ప్రమాణం చేయించబోతున్నారు.
90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీలో 13 మంది మంత్రులు ఉండేందుకు అవకాశం ఉంది. ఇందులో సీఎంతో పాటు 10 మంది మంత్రులు ఇవాళ ప్రమాణం చేయబోతున్నారు. మరో 3 సీట్లను ఖాళీగా ఉంచాలని బీజేపీ నిర్ణయించింది.

ఇవాళ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్న ఎమ్మెల్యేల్లో సీఎం నాయబ్ సైనీతో పాటు కిషన్ లాల్ పన్వర్, రణ్ బీర్ గంగ్వా, రావు నర్బీర్ సింగ్, మహిపాల్ థండా, క్రిషన్ బేడీ, క్రిషన్ లాల్ మిథా, అనిల్ విజ్, అరవింద్ శర్మ, విపుల్ గోయల్, ఆర్తీ రావు, శృతీ చౌదరి, శక్తి రాణీ శర్మ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు భారీ ఎత్తున అతిథుల్ని ఆహ్వానించారు. అలాగే ఎన్డీయే రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు. ఇందులో ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications