వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: నేతాజీ కుటుంబంపై 20ఏళ్ల పాటు నెహ్రూ నిఘా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ హవాలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో తుడిచి పెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్! కాంగ్రెస్ రహిత భారత్ అంటూ చెబుతున్న బీజేపీ సాధ్యమైనంతగా ఆ పార్టీని కార్నర్ చేసే ప్రయత్నాలు చేస్తోంది. అయితే, తాజాగా ఓ షాకింగ్ వార్త వెలుగు చూసింది. ఇది కాంగ్రెస్ పార్టీకి మరింత చిక్కులు తెచ్చేదిగా కనిపిస్తోందని అంటున్నారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మీడియాలో వస్తున్న కథనం మేరకు... నాటి జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం నేతాజీ కుటుంబం పైన ఇరవయ్యేళ్ల పాటు నిఘా ఉంచింది. ఈ విషయం నిఘా వర్గాల ద్వారా వెల్లడైనట్లు తెలుస్తోంది.

 Nehru Govt spied on Netaji?

1948 నుండి 1968 మధ్య జరిగిన విషయాలు వెల్లడయ్యాయి. ఆ పైళ్లలోని సమాచారం మేరకు.. నాడు కోల్‌కతాలోని బోస్‌కు చెందిన 1 ఉడెన్ బర్న పార్క్, 38/2 ఎల్గిన్ రోడ్డులోని నివాసాల పైన నిఘా ఉంచారు. వాటిపై నేరుగా నెహ్రూకు నివేదిక ఇచ్చేవారు.

బోస్ కుటుంబ సభ్యులు రాసిన లేఖల కాపీలు, వారు దేశంలో, విదేశాల్లో ఎక్కడెక్కడ ప్రయాణించేవారో ఐబీ తెలుసుకునేదని తెలుస్తోంది.

శరత్ చంద్రబోస్ కుమారులు, నేతాజీ మేనళ్లుల్లు శశిర్ కుమార్ బోస్, అమియా నాథ్ బోస్‌లకు సంబంధించిన విషయాలు ట్రాక్ చేసేవారని తెలుస్తోంది. వీరు ఆస్ట్రియాలో ఉన్న నేతాజీ భార్య ఎమిలికి అప్పుడప్పుడు లేఖలు రాసేవారు. బోస్‌కు సంబంధించిన రహస్య ఫైళ్లను బహిర్గతం చేసేందుకు కేంద్రం ఇటీవల నిరాకరించింది. ఇందుకు కారణాలు చెప్పాలని కోల్‌కతా హైకోర్టు ప్రశ్నించింది. ఆ మరుసటి రోజు ఫైళ్ల వివరాలు బయటపడటం గమనార్హం.

English summary
This could again add to overflowing cup of woes of Congress. Party which is already pushed to wall by Modi-led BJP in recent elections, will be further cornered by the Saffron party.
Read in English: Nehru Govt spied on Netaji?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X