వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్డ్స్ పైన పేదలకు కొత్త యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ ప్లాన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన సామాజిక సంక్షేమ పథకాలలో ఒకటిగా భావించే సోషల్ సెక్యూరిటీ ప్లాన్ ప్రణాళిక డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసింది. దేశంలోని పేదలకు యూనివర్సల్ సామాజిక భద్రత కవరేజ్ కల్పించనుంది. ఇందుకోసం రూ.1.2 లక్షల కోట్లను కేటాయిస్తున్నారు. ఇది అసంఘటిత రంగంలో ఉపాధి కల్పించే వారికి ఎంతో లాభదాయకం.

అసంఘటిత రంగంలో ఎంతోమంది ఉన్నారు. భారత దేశంలో కనీస వేతనం పొందని వారు దాదాపు 90 శాతం మంది ఉన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ పెద్ద పథకం అందరిని దృష్టిలో పెట్టుకొని తయారు చేసినది.

ఈ విస్తృత కార్యక్రమం మూడు విభాగాలుగా ఉంది. ప్రభుత్వం చెల్లింపులు పొందే 20 శాతం పేదవారితో పాటు ఈ స్కీంకు సబ్ స్క్రైబ్ అయిన ఫార్మల్ సెక్టార్‌లోని వారు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ తెలిపింది.

సమాచారం మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ.. ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపించింది. కాబట్టి నిధులపై విధివిధానాలు రానున్నాయి.

New universal social security plan for poor on cards

ఈ పథకం రెండు శ్రేణుల్లో ఉంది. అందులో మొదటిది తప్పనిసరి పెన్షన్, ఇన్సురెన్స్ (చనిపోయినా లేదా అంగవైకల్యం కలిగినా), ప్రస్తూ కవరేజ్. రెండోది ఐచ్ఛిక వైద్య, అనారోగ్యం మరియు నిరుద్యోగ కవరేజ్. ఈ విషయాలు ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది.

చాలా కంపెనీలలో ప్రావిడెంట్ ఫండ్‌లో ఉద్యోగితో పాటు కంపెనీ కూడా చెల్లిస్తుంది. ఇదంతా పీపీఎఫ్ అకౌంటులోకి వెళ్తాయి. ఆ ఉద్యోగి అక్కడ ఉద్యోగం మాని మరోచోట చేరినా ఏ ఒక్కరి పీపీఎఫ్ అకౌంట్ నెంబర్ మారదు.

ప్రభుత్వం ఉద్దేశించిన కొత్త పథకం అసంఘటిత రంగాలలో పని చేసే ప్రజలకు ఇదే సామాజిక మరియు ఆర్థిక భద్రత కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

English summary
In what can be called one of the most ambitious social welfare schemes of the Modi-led government, the Labour Ministry has drafted a plan to provide universal social security coverage for the poorest fifth of the country. The plan, for which Rs 1.2 lakh crore is likely to be set aside, will greatly benefit those employed in the unorganised sector and lack any kind of social security coverage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X