Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెళ్లి పీటల మీది నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి..!

న్యూఢిల్లీ: ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇష్టపడని వారు చాలామందే ఉంటారు. పోలింగ్ బూత్ దాకా వెళ్లడం, అక్కడ క్యూలో నిల్చోవాల్సి రావడం.. ఇన్ని తిప్పలు పడటం ఎందుకంటూ హాయిగా ఇంటి పట్టున ఉండే బద్ధకిస్టులు మనకు తరచూ కనిపిస్తుంటారు. అలాంటి వారికి కనువిప్పు కలిగించే ఘటనలో గురువారం రెండో దశ పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్నాయి.

పెళ్లి పీటల మీది నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి బయలుదేరి వచ్చింది ఓ నూతన జంట. తమ ఓటు హక్కును వినియోగించుకుంది. జమ్మూకాశ్మీర్ లోని ఉధంపూర్ లోక్ సభ పరిధిలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఛత్తీస్ గఢ్, మహారాష్ట్రల్లోనూ ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. వంద సంవత్సరాలకు పైగా వయస్సున్న వయోధిక వృద్ధలు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరి, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

newly married bride and groom cast their Votes in various places

జమ్మూకాశ్మీర్ లోని ఉధంపూర్ లోక్ సభ పరిధిలో ఓ నూతన జంట పెళ్లి దుస్తుల్లోనే కళ్యాణమంటపం నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి చేరుకుంది. నూతన దంపతులు క్యూలో నిల్చుని, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బంది వారిని అభినందించడం విశేషం. ఛత్తీస్ గఢ్ లోని రాజనందగావ్ లోక్ సభ పరిధిలో కూడా ఇలాంటి ఘటనే కనిపించింది.

newly married bride and groom cast their Votes in various places

రాహుల్ హరిహర్నో అనే యువకుడు పెళ్లి మీటల మీది నుంచి సరాసరి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశాడు. మళ్లీ పెళ్లి మంటపానికి వెళ్లిపోయాడు. రిసెప్షన్ మధ్యలో తాను ఓటు వేయడానికి వచ్చానని రాహుల్ హరిహర్నో చెప్పాడు. మహారాష్ట్రలోని అకోలా జిల్లాలోని హాట్రన్ గ్రామంలో నూతన వరుడు ఓటు వేసి, పెళ్లి మంటపానికి బయలుదేరి వెళ్లాడు. బెంగళూరు జయనగరలో సుమారు 90 సంవత్సరాలకు పైగా వయస్సున్న వయోధిక వృద్ధ దంపతులు ఓటు వేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+