నీరవ్‌ మోడీ ఎఫెక్ట్: ఎల్ఓయూ, ఎల్ఓసీలకు స్వస్తి చెప్పిన ఆర్‌బిఐ

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆర్‌బిఐ దిద్దుబాటు చర్యలను తీసుకొంటుంది. ట్రేడ్‌ క్రెడిట్‌ కింద ఇచ్చే లెటర్‌ ఆఫ్‌ అండర్‌ టేకింగ్‌ (ఎల్‌వోయూ), లెటర్‌ ఆఫ్‌ కంఫర్ట్‌ (ఎల్‌వోసీ)లకు స్వస్తి పలుకుతున్నట్లు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది.

బ్యాంక్‌ ఉద్యోగులతో కుమ్మక్కై తప్పుడు ఎల్‌వోయూలతో నీరవ్‌ మోదీ , మెహుల్‌ చోక్సీలు రూ.12,700 కోట్ల మేర దోపిడీకి పాల్పడి విదేశాలకు చెక్కేయడంతో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

Nirav Modi Effect: RBI Stops Letters of Undertaking For Overseas Credit

ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన తర్వాత దిగుమతిదారులకు ఆథరైజ్డ్‌ డీలర్‌ కేటగిరి బ్యాంక్‌-1లు వ్యాపార రుణం కింద ఎల్‌వోయూ, ఎల్‌వోసీల జారీని నిలిపివేయాలని నిర్ణయించినట్టు ఆర్‌బిఐ ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆర్‌బీఐ ఒక ప్రకటించింది.

ఎల్‌వోయూలు, ఎల్‌వోసీలు విదేశాల్లో వ్యాపారం చేసేవారికి కీలకమైనవి. సదరు వ్యాపారస్థులకు విదేశాల్లోని ఇతర భారత బ్యాంకుల బ్రాంచీలకు హామీలను సమకూరుస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+