మంచి ప్యాకేజీ రాలేదని బీహార్ లాడ్జిలో తెలుగు నిట్ విద్యార్థి ఆత్మహత్య

Posted By:
Subscribe to Oneindia Telugu

కరీంనగర్/పాట్నా: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)-పాట్నాలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న తెలుగు విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

క్యాంపస్ సెలక్షన్స్‌లో తన కంటే తక్కువ ర్యాంకు వచ్చిన వారికి మంచి వేతన ప్యాకేజీ వచ్చిందని, తనకు తక్కువ వేతన ప్యాకేజీ దొరికిందనే ఆవేదనతో పాట్నాలో చనిపోయాడు.

NIT Patna student commits suicide

ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి జగిత్యాల జిల్లాకు చెందిన పెంటపర్తి సురేందర్‌. జిల్లాలోని మెట్‌పల్లి మండలం వెల్లుల్లకు చెందినవాడు.

బుధవారం ఓ లాడ్జిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్యాంపస్ సెలక్షన్ విషయంలో సురేందర్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని అతని స్నేహితులు తెలిపారని తీర్భవార్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. మృతుడి సోదరుడికి సమాచారం అందించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A final-year B.Tech student of the National Institute of Technology (NIT) here allegedly committed suicide in his private lodge on Wednesday, police said. Surender P Parthi, an Information Technology (IT) student from Karim Naagar in Telangana, was found hanging from the ceiling fan of his room in Mahendru locality, close to the Institute.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి