వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జన్ ధన్ , బేసిక్ సేవింగ్స్ ఖాతాలకు మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు'

బేసిక్ సేవింగ్స్ ఖాతాలకు, జన్ ధన్ యోజన ఖాతాలకు కనీస నగదు నిల్వ చేయాల్సిన అవసరం లేదని ఎస్ బి ఐ చైర్మెన్ అరుంధతీ రాయ్ చెప్పారు. నిబంధనలు సరిగా చదవని వారే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: ఈ ఏడాది ఏప్రిల్ 1వ, తేది నుండి అమల్లొకి తీసుకురానున్న కనీస బ్యాలెన్స్ నిబంధనలపై ఎస్ బి ఐ బ్యాంకు చైర్మెన్ అరుంధతి భట్టాచార్య మరోసారి వివరణ ఇచ్చారు.ఇతర బ్యాంకుల్లో చాలా వరకు తాము అమలు చేయాలనుకొన్న నిబంధలను కొనసాగిస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
బేసిక్ సేవింగ్ బ్యాంకు , జన్ ధన్ యోజన ఖాతాలకు కనీస నిల్వ నిబంధనలు వర్తించవని ఆమె చెప్పారు. ప్రాథమిక అవసరాల కోసం వినియోగించే ఖాతాలకు మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలు వర్తించబోవని ఆమె ప్రకటించారు.

 no need for minimum balance for jan dhan yojana and basic savings accounts

నిబంధనలను సరిగా చదవని వారే అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. ఖాతాదారుల సంఖ్యను పెంచుకొనేందుకుగాను 2012 లో కనీస నగదు నిల్వ నిబంధనను ఎస్ బి ఐ ఎత్తివేసింది.
ఈ నిబంధనను ఈ ఏడాది ఏప్రిల్ నుండి అమలు చేయనుంది.ఏప్రిల్ నుండి అమలు చేయనున్న నిబంధనలపై బ్యాంకులు వెనక్కి తగ్గేలా కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలు వచ్చాయి.

ఏదేమైనా కొత్తగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి అడుగుపెట్టిన నిరుపేదలకు కనీస మొత్తం నుండి మినహయింపు ఉండడంతో అత్యధికులుగా ఉన్న చిరు వినియోగదారులపై ప్రభావం లేనట్టేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

English summary
no need for minimum balance for jan dhan yojana and basic savings accounts said sbi chairmen. she explained on minimum balance sbi accounts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X