ఐదు, పది వేల నోట్లను ప్రవేశపెట్టడం లేదు:కేంద్రం

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐదువేలు, పది వేల రూపాయాలన నోట్లను ప్రవేశపెట్టే యోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహయ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ ప్రకటించారు.

ఖర్చును తగ్గించుకొనేందుకుగాను కొత్తగా ఐదువేలు, పదివేల రూపాయాల నోట్లను తీసుకువస్తారా అని కొందరు సభ్యులు మంత్రిని ప్రశ్నించిన సమయంలో ఆయన ఈ మేరకు స్పందించారు.ఈ అంశంపై రిజర్వర్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సంప్రదించినట్టు అర్జున్ రామ్ మేఘావాల్ చెప్పారు.

no plans to introduce 5,000 and 10,000 rupee notes: govt

ఈ మేరకు సభ్యులకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.వీటి ముద్రణకు తగిన నిధులు ఆర్ బి ఐ దగ్గర లేవని ఆయన తన సమాధానంలో చెప్పారు.

గత ఏడాది నవంబర్ 8వ, తేదిన చలామణిలో ఉన్న 86 శాతం రూ500, వెయ్యి రూపాయాల నోట్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అనంతరం కొత్త రూ.500 రూపాయాల నోట్లతో పాటు రెండు వే రూపాయాల నోటును కూడ ప్రవేశపెట్టింది, వెయ్యిరూపాయాల నోటును ప్రవేశపెట్టేయోచన లేదని కేంద్ర స్పష్టం చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
the government on Friday said it has no plans to come out with Rs 5,000 and Rs 10,000 banknotes.
Please Wait while comments are loading...