వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాగ్ కింద పడేసి, మహిళా జడ్జిని తిట్టిన ఓలా డ్రైవర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మహిళా న్యాయమూర్తితో అనుచితంగా ప్రవర్తించినందుకు ఢిల్లీ పోలీసులు గురువారం నాడు 40 ఏళ్ల వయస్సున్న ఓలా క్యాబ్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. అతను వేధించింది.. మామూలు మహిళను కాదు. ఏకంగా మహిళా సెషన్స్ జడ్జిని వేధించడం గమార్హం.

సదరు మహిళా న్యాయమూర్తి.. తీస్ హజారీ న్యాయస్థానంలో అడిషనల్ సెషన్స్ జడ్జిగా పని చేస్తున్నారు. తను బుక్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్ నోటికొచ్చినట్టు అసభ్యంగా తిట్టాడని, ఆమె చేసిన ఫిర్యాదు మేరకు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Ola driver arrested for misbehaving with Delhi judge

నార్త్ ఢిల్లీలోని ఓ మార్కెట్ వద్ద షాపింగ్ కోసం వెళుతూ క్యాబ్‌ను వేచిచూడాలని కోరానని, దీంతో తనను తిట్టి, కారులోని బ్యాగును రోడ్డు మీదకు విసిరేశాడని ఆమె వివరించారు. మహిళల పట్ల క్యాబ్ డ్రైవర్ల వైఖరి మారాల్సి ఉందన్నారు

ఓలా క్యాబ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాము డ్రైవర్‌ను వెంటనే విధుల నుంచి తొలగించామని, విచారణ ముగిసే వరకు ఆయనను విధుల నుంచి తొలగిస్తామని చెప్పారు. తాము విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని చెప్పారు.

English summary
Delhi Police arrested a 40 year old Ola cab driver on Thursday on charges of misbehaving with an additional sessions judge and making obscene gestures in front of her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X