నిర్మలాదేవి కేసు: పోలీసుల చేతికి ఎస్‌ఎంఎస్‌లు, సెలబ్రేషన్స్, విచారణ ప్రారంభం
Recommended Video

చెన్నై: విద్యార్ధినులను పడువు వృత్తిలోకి దించేందుకు ప్రోత్సహించిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రోఫెసర్ నిర్మలాదేవి విషయమై నిజాలను నిగ్గుతేల్చేందుకు ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఐఎఎస్ సంతానం విచారణ ప్రారంబించారు. తమిళనాడు గవర్నర్ ప్రోఫెసర్ నిర్మలాదేవి వ్యవహారంపై నిజాలను తేల్చేందుకు సంతానం కమిటీని ఏర్పాటు చేశారు. రెండు వారాల్లోపుగా నివేదికను ఇవ్వాలని కమిటీని గవర్నర్ ఆదేశించారు.
విద్యార్ధినులను పడువు వృత్తిలోకి ప్రోత్సహించిందని ప్రోఫెసర్ నిర్మలాదేవిపై ఆరోపణలు వచ్చాయి.ఈ ఆరోపణల నేపథ్యంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు తనకు చాలా పెద్దవారితో కూడ పరిచయాలున్నాయని ఆమె విద్యార్ధినులను బెదిరింపులకు పాల్పడేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయమై ప్రోఫెసర్ నిర్మలాదేవి ఎవరో తనకు తెలియదని తమిళనాడు గవర్నర్ కూడ ప్రకటించారు. ఈ విషయమై వాస్తవాలను వెలికి తీయాలని రిటైర్డ్ సంతానం కమిటీని ఆయన ఆదేశించారు.

సంతానం కమిటి విచారణ ప్రారంభం
విద్యార్ధినులను పడువు వృత్తిలోకి ప్రేరేపించిందనే విషయమై ప్రోఫెసర్ నిర్మలాదేవి ఉదంతంపై ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఐఎఎస్ సంతానం కమిటి గురువారం నాడు విచారణను ప్రారంభించింది. చెన్నై నుంచి మదురై వెళ్లిన సంతానం అక్కడి ప్రభుత్వ అతిథిగృహంలో బసచేసి మదురై కామరాజర్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ చెల్లదురై, రిజిస్ట్రారు చిన్నయ్య తదితరులను క రిటైర్డు ఐఏఎస్ అధికారి ఆర్ సంతానం విచారించారు.విద్యార్థినులతో నిర్మలాదేవి సెల్‌ఫోన్ సంభాషణను పరిశీలించారు.

పది నెలల్లో 200 ఉత్సవాలు
మద్యం, జల్సా పార్టీలతో మదురై కామరాజ్ యూనివర్సిటీ కేళీవిలాసాల్లో మునిగితేలుతున్నట్లు విచారణ కమిషన్‌కు కొందరు ఫిర్యాదు చేశారు. పదినెలల్లో 200 ఉత్సవాలు, 60 మెగా పార్టీలు నిర్వహించగా కేవలం జీడిపప్పు కొనుగోలుకే రూ.18 లక్షలు ఖర్చు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. . ఈ కేసు విచారణకు ఏడు బృందాలను ఏర్పాటు చేసుకున్నట్లు సీబీసీఐడీ ఎస్పీ రాజేశ్వరి తెలిపారు. సైబర్ క్రైం పోలీసుల సహకారం తీసుకుంటున్నామని, నిర్మలాదేవి బ్యాంకు ఖాతాలను తనిఖీ చేస్తున్నామని చెప్పారు.

యూనివర్శిటీలో వేర్వేరుగా విచారణ
ఈనెల 21వ తేదీన యూనివర్సిటీలోని వివిధ విభాగాధిపతులను , నిర్మలాదేవి పనిచేసిన కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందాన్ని వేర్వేరుగా విచారించనున్నారు. ,గవర్నర్ నియమించిన కమిషన్ విచారణ ప్రారంభమైందని విచారణకు పూర్తి సహకరిస్తున్నామని యూనివర్శిటీ వైస్ ఛాన్సిలర్ చెల్లదురై ప్రకటించారు. మరోవైపు సంతానం కమిటికి ఇద్దరు మహిళా ప్రోఫెసర్లు విచారణ కమిటిలో చేరారు. విద్యార్ధినులతో మాట్లాడేందుకు ఈ మహిళా ప్రోఫెసర్లను కమిటిలో చోటు కల్పించారు. అయితే ఏప్రిల్ 20న నిర్మలాదేవి పనిచేసిన కాలేజీలో విచారణ చేయనున్నట్టు సంతానం ప్రకటించారు. ఏప్రిల్ 21న లేదా ఏప్రిల్ 23న, జైలులో ఉన్న ప్రోఫెసర్ నిర్మలాదేవిని తాను కలవనున్నట్టు సంతానం తెలిపారు.

నిర్మలాదేవిపై ఫిర్యాదు చేసిన విద్యార్ధినులు
నిర్మలాదేవికి సంబంధించి 26 పేజీలతో కూడిన ఆధారాలను కొందరు విద్యార్థినులు అరుప్పుకోట్టై పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. లైంగిక కార్యకలాపాలకు అంగీకరించాల్సిందిగా కోరుతూ ఆమె పంపిన ఎస్‌ఎమ్‌ఎస్‌లను 20 పేజీలపై ముద్రించి అందజేసినట్లు సమాచారం.ఈ ఎస్‌ఎంఎస్‌ల ఆధారంగా పోలీసులు విచారణ చేయనున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications