వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేటి నుంచే పార్లమెంట్ సమావేశాలు - అగ్నిపథ్ పై చర్చ : రాష్ట్రపతి- ఉప రాష్ట్రపతి ఎన్నికలు..!!

|
Google Oneindia TeluguNews

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు రాష్ట్రపతి ఎన్నిక ఉండటంతో..ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలోనే తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆగస్టు 12వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే సమావేశాల నిర్వహణ..అజెండా పైన స్పీకర్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ప్రతిపక్షాలు ఏ అంశం పైన అయినా సరైన విధానంలో చర్చకు వస్తే తాము సిద్దంగా ఉన్నామని అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం స్పష్టం చేసింది.

అగ్నిపథ్ పై సమావేశాల్లో చర్చ

అగ్నిపథ్ పై సమావేశాల్లో చర్చ

త్రివిధ దళాల్లో తాత్కాలిక నియామకాలకు సంబంధించిన అగ్నిపథ్ పథకం, ఆర్థికవ్యవస్థ, నిరుద్యోగం, నిత్యావసర ధరల పెరుగుదల వంటి అంశాలను లేవనెత్తాలని విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. వివిధ శాఖలు 32 బిల్లులను సూచించినట్లు కేంద్రం వెల్లడించింది. వీటిలో 14 బిల్లులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అగ్నిపథ్ పైన చర్చకు సిద్దమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న అటవీ హక్కుల చట్టం-2006 సవరణ బిల్లుపై ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ గుర్తుచేశారు.

శ్రీలంక సంక్షోభం పై అఖిలపక్ష భేటీ

శ్రీలంక సంక్షోభం పై అఖిలపక్ష భేటీ

సమావేశాల్లో ధరల పెరుగుదల, అగ్నిపథ్, సమాఖ్య వ్యవస్థపై దాడి, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం సహా 13 అంశాలపై చర్చించాలని అఖిలపక్ష భేటీలో డిమాండ్ చేసినట్లు విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే వెల్లడించారు. ఇదే సమయంలో అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకాకపోవటంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అఖిలపక్ష భేటీకి ఎప్పటిలాగే ప్రధాని మోదీ గైర్హాజరయ్యారంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. అఖిలపక్ష భేటీఅఖిలపక్ష భేటీలో రాజ్​నాథ్​ సింగ్, పీయూష్​ గోయల్​అసభ్య పదజాలానికి సంబంధించిన మార్గదర్శకాలపై పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా జోషి వివరణ ఇచ్చారు.

రాష్ట్రపతి - ఉప రాష్ట్రపతి ఎన్నికలు

రాష్ట్రపతి - ఉప రాష్ట్రపతి ఎన్నికలు


అఖిలపక్ష సమావేశంలో శ్రీలంక విషయంలో భారత్ జోక్యం చేసుకోవాలని డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు డిమాండ్ చేశాయి. లంకలోని తమిళుల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక సంక్షోభంపై మంగళవారం అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ప్రహ్లాద్ జోషీ వెల్లడించారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జైశంకర్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ ఏర్పాటుచేసినట్లు తెలిపారు. వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే 32 బిల్లుల జాబితాను కేంద్రం సమావేశంలో సభ్యులకు అందించింది. ఇక, ఈ సమావేశాల్లోనే నూతన రాష్ట్రపతి ఎన్నిక - ప్రమాణ స్వీకారం..అదే విధంగా ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనున్నాయి. దీంతో..ఈ సమావేశాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.

English summary
Parliament Monsoon session begin today, With the session scheduled to end on August 12, during which 32 Bills are likely to be introduced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X