• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విమానాలకు పెట్రోల్ కష్టాలు తప్పినట్టే..! 2022 నాటికి కరెంటు విమానాలు..!!

|

ముంబై/హైదరాబాద్ : భారత విమానాలకు ఇంధన బాధలు తప్పబోతున్నాయి. ఇంధనం కోసం ఎక్కడో ఏదో దేశంలో అత్యవసరంగా విమానాన్ని దించే పరిస్థితులకు చెక్ పడబోడబోతోంది. డీజిల్, పెట్రోల్ వాహనాలతో కాలుష్యం పెరిగి పర్యావరణం పాడైపోతోంది. వాటికి ప్రత్యామ్నాయం లేదా..? అంటే బాగా వినిపిస్తున్న మాట కరెంట్ బండ్లు. ఇప్పటికే కార్లు, బైకుల కంపెనీలు వాటిపై దృష్టి పెట్టాయి. కొన్ని దేశాల్లో నడుస్తున్నాయి కూడా. మరి విమానాల పరిస్థితేంటి..? ఆ దిశగానూ అడుగులు పడ్డాయి. అందుకే ఇప్పడు కంపెనీలు ఎలక్ట్రిక్ విమానాలపై దృష్టి పెట్టాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో కొద్ది రోజుల క్రితం నిర్వహించిన ఎయిర్ షోలో కంపెనీలు ఎలక్ట్రిక్ విమానాలు, వాటి మోడళ్లను ప్రదర్శించాయి.

 విమానాలకు తప్పనున్న ఇంధన సమస్య..! అంతా విద్యుత్తే..!!

విమానాలకు తప్పనున్న ఇంధన సమస్య..! అంతా విద్యుత్తే..!!

ఆ ఎయిర్ షోలో ఎలక్ట్రిక్ విమానాలతో పాటు హైబ్రిడ్ విమానాలూ కనిపించాయి. చాలా మంది కస్టమర్లు వాటిపైనే ఎక్కువ ఇష్టం చూపించారు. గత ఏడాదితో పోలిస్తే ఎలక్ట్రిక్ విమానాల తయారీ ఈ ఏడాది 50 శాతం పెరిగి 170 శాతానికి చేరిందని, ఈ ఏడాది చివరినాటికి 200శాతం వరకు చేరుతుందని రోలండ్ బెర్జర్ అనే కన్సల్టెన్సీ అంచనా వేసింది. పారిస్ ఎయిర్ షోలో అందరి కళ్లు ఇజ్రాయెల్ కంపెనీ ఎవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ పైనే పడ్డాయి. ఆ కంపెనీ యలైస్ అనే ఎలక్ట్రిక్ విమానాన్ని తయారుచేసింది. ఆ విమానాన్ని అమెరికా కంపెనీ కేప్ ఎయిర్ కొనుక్కోబోతోంది. తమకు ఫస్ట్ కస్టమర్ ఆ కంపెనీయేనని పేర్కొంది.

బ్యాటరీలో తో ఛార్జింగ్..! తగ్గనున్న కాలుష్యం..!!

బ్యాటరీలో తో ఛార్జింగ్..! తగ్గనున్న కాలుష్యం..!!

యలైస్ కు ఒక్కసారి చార్జింగ్ పెడితే, 1,050 కిలోమీటర్లు వెళుతుందని, కంపెనీల ఖర్చు 70% తగ్గిపోతుందని చెప్పింది. ఈ ఏడాదే అమెరికాలో వాటి ఉత్పత్తి ప్రారంభించామని కంపెనీ తెలిపింది. విమానాన్ని ముందుకు నడిపించేలా తోకలో ఓ పుషర్ ప్రొపెల్లర్, రెక్కల అంచుల్లో మరో రెండు ప్రొపెల్లర్లు ఉంటాయి.

అన్నీ బ్యాటరీలతోనే పనిచేస్తాయి. 10 వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుంది. డిఫెన్స్ కాంట్రాక్టర్ అయిన రేథియన్ కంపెనీతో కలిసిపోతున్నట్టు యునైటెడ్ టెక్నాలజీస్ అనే కంపెనీ పారిస్ ఎయిర్ షోలో ప్రకటించింది.

 అదునాతన సాంకేతికత..! పక్కా అమలు చేయబోతున్న భారత్..!!

అదునాతన సాంకేతికత..! పక్కా అమలు చేయబోతున్న భారత్..!!

హైబ్రిడ్ ఎలక్ట్రిక్ విమానానికి సంబంధించి డిజైన్ ను కూడా విడుదల చేసింది. 2022 నాటికి వాటిని నడపాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎయిర్ బస్ కూడా హైబ్రిడ్ ఎలక్ట్రిక్ విమానాలపై దృష్టి పెట్టింది. ఆ కంపెనీ కూడా 2022 నాటికి తొలి విమానాన్ని రెడీ చేయాలని భావిస్తోంది. విమాన విడిభాగాలు, సిస్టమ్ల అనుసంధానంపై దాహెర్, ఎకోపల్స్ అనే ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్పై సాఫ్రన్ పనిచేయనున్నాయి. బ్యాటరీలు, ఏరోడైనమిక్ డిజైన్ సంగతి ఎయిర్ బస్ చూసుకుంటుంది. ఎలక్ట్రిక్ మోటార్లు, ప్రొపెల్లర్లను నడిపించేలా విమానంలో టర్బోజనరేటర్లు అమర్చుతారు.

 వివిధ సంస్థలతో ఒప్పందాలు..! 2022 కల్లా అమలు..!!

వివిధ సంస్థలతో ఒప్పందాలు..! 2022 కల్లా అమలు..!!

అంతేకాదు, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ ను రీసెర్చ్ చేసేందుకు ఎస్ఏఎస్ స్కాండినేవియన్ ఎయిర్ లైన్స్ తోనూ ఒప్పందం చేసుకున్నట్టు ఎయిర్ బస్ ప్రకటించింది. బ్రిటన్ కు చెందిన ఫేమస్ కార్ల కంపెనీ రోల్స్ రాయ్స్ కూడా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్ ప్రొపల్షన్ వ్యవస్థలపై జర్మనీ కంపెనీ సీమెన్స్ తో ఒప్పందం చేసుకుంది. జర్మనీ, హంగరీలో ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఇందుకోసం 180 మంది స్పెషలిస్ట్ ఇంజనీర్లను కంపెనీ ఇప్పటికే నియమించుకుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Fuel woes for Indian aircraft There is going to be a check in the country for emergency fuel flight somewhere. The pollution with diesel and petrol vehicles is increasing and the environment is being damaged. Nowadays companies focus on electric aircraft. The companies showcased their electric planes and their models at an air show held a few days ago in the French capital of Paris.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more