ఫైజర్ షాకింగ్ నిర్ణయం.. భారత్‌లో టీకా వినియోగానికి చేసిన దరఖాస్తు ఉపసంహరణ
అమెరికన్ ఫార్మా దిగ్గజం ఫైజర్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో తన కోవిడ్-19 వ్యాక్సిన్ యొక్క ఎమర్జెన్సీ వినియోగం ఆథరైజేషన్ కోసం చేసిన దరఖాస్తును ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఫార్మా దిగ్గజం ఫైజర్ శుక్రవారం ఒక ప్రకటన చేసింది.

ఫిబ్రవరి 3వ తేదీన డిసిజీఐ నిపుణుల కమిటీ ముందు హాజరైన ఫైజర్ .. సడన్ నిర్ణయం
యూ కె మరియు బహ్రెయిన్‌లో ఇటువంటి క్లియరెన్స్ పొందిన తరువాత, భారత దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి అత్యవసర వినియోగ అధికారాన్ని కోరిన మొదటి ఔషధ సంస్థ ఫైజర్. ఫిబ్రవరి 3వ తేదీన డిసిజీఐ నిపుణుల కమిటీ ముందు హాజరైన ఫైజర్ ఈ సమావేశంలో జరిగిన చర్చలు, రెగ్యులేటరీకి అవసరమైన అదనపు సమాచారం గురించి తమకు ఉన్న అవగాహన ఆధారంగా తమ దరఖాస్తు ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ఫైజర్ పేర్కొంది.

అత్యవసర వినియోగానికి చేసిన దరఖాస్తు ఉపసంహరణ
రెగ్యులేటరీ అడిగిన అదనపు సమాచారాన్ని జోడించిన తర్వాత భవిష్యత్తులో వ్యాక్సిన్ అనుమతి కోసం తిరిగి ప్రయత్నం చేస్తామని అమెరికన్ ఫార్మా దిగ్గజం ఫైజర్ స్పష్టం చేసింది.
ఫైజర్ తన వ్యాక్సిన్ భారతదేశంలో ప్రభుత్వం ఉపయోగించుకునేలాగా, అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసింది. అయితే రెగ్యులేటరీ ముందు హాజరైన నేపథ్యంలో, వారు అడిగిన అదనపు సమాచారాన్ని జోడించడానికి మరికొంత సమయం పడుతుందని భావిస్తూ తమ అత్యవసర వినియోగ దరఖాస్తు ఉపసంహరించుకుంటున్నట్లు గా పేర్కొంది.

భారతీయులపై క్లినికల్ ట్రయల్స్ తో సంబంధం లేకుండా టీకా వినియోగానికి అనుమతులు కోరిన ఫైజర్
డిసెంబర్ 2020లో బిసిసిఐకి అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసిన మొట్టమొదటి వ్యాక్సిన్ ఫైజర్. అమెరికాకు చెందిన ఫైజర్ జర్మనీ సంస్థ అయిన బయోఎన్టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ భారతీయులపై క్లినికల్ ట్రయల్స్ తో సంబంధం లేకుండా తమ టీకాను వినియోగించుకోవడానికి అనుమతులను కోరింది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications