బాంబులతో ఇంటిని పేల్చేస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఫోన్ కాల్
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు రావడం ప్రస్తుతం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో దేశంలోని ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నాయకులతో పాటు అధికారంలో ఉన్న రాష్ట్ర, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులకు బాంబు బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయి.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బాంబు బెదిరింపు
ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇంట్లో బాంబులు పెట్టామని, మరి కాసేపట్లో ఆయన ఇంటిని పేల్చేస్తామంటూ ఓ అగంతకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. కేవలం పది నిమిషాల్లోనే కేంద్రమంత్రి నితిన్ గడ్కరి ఇంటిని పేల్చివేస్తామని సదరు నిందితుడు తెలిపాడు. నాగపూర్ లోని గడ్కరి నివాసంలో బాంబు పెట్టినట్టు ఓ వ్యక్తి కాల్ చేసి చెప్పడంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

గంటల వ్యవధిలోనే నిందితుడు అరెస్ట్
కానీ ఎటువంటి అనుమానాస్పదమైన వస్తువులు లభించలేదు. ఎలాంటి ప్రమాదకరమైన వస్తువులు దొరకకపోవడంతో ఆ కాల్ నకిలీ కాల్ అని తేల్చారు. అనంతరం ఫోన్ నెంబర్ ఆధారంగా గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నకిలీ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని నాగపూర్ తులసి బాగ్ రోడ్ లోని మద్యం దుకాణంలో పనిచేసే ఉమేష్ విష్ణు రౌత్ గా గుర్తించామన్నారు.
నితిన్ గడ్కరీకి భద్రత పెంపు
క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతనిని అరెస్టు చేసి ప్రస్తుతం అతను ఎందుకు ఈ బెదిరింపు కాల్ చేశాడు అన్న దానిపైన విచారణ చేస్తున్నారు. పోలీసులు ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక నితిన్ గడ్కరీకి సంబంధించి బెదిరింపు కాల్ వచ్చిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఆయనకు భద్రతను పెంచారు. నాగపూర్ లో ఉన్న మంత్రి నితిన్ గడ్కరీ సురక్షితంగానే ఉన్నారని అధికారులు తెలిపారు.
పట్టుబడిన వ్యక్తిని విచారిస్తున్న పోలీసులు
12 ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ కు వచ్చిన కాల్ ఆధారంగా అప్రమత్తమై కేసు నమోదు చేసి, దర్యాప్తులో ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోన్ వన్ రిషికేశ్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం పట్టుబడిన నిందితుడిపై గతంలో ఎటువంటి కేసులు లేవని, అతనికి నేరచరిత్ర లేదని పేర్కొన్నారు. ఈ బెదిరింపు వెనుక ఉన్న కారణాల పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ?












Click it and Unblock the Notifications