Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ దాడిపై భారత్ కీలక నిర్ణయం-రంగంలోకి NIA..!
గత నెల 30న దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ కు వెళ్తున్న ఫ్లై దుబాయ్(Flydubai)విమానాన్ని నడుపుతున్న భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ (Smit Machchhar) పై పక్కనే ఉన్న ఒమన్ కు చెందిన కో పైలట్ హమ్మామీ జరిపిన భయానక దాడి అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రం గాయపడ్డ స్మిత్ మచ్చర్ ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు. కోపైలట్ ను అరెస్టు చేసి యూఏఈ అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో దాగి ఉన్న పూర్తి కుట్రను తెలుసుకునేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించింది.
ఫ్లైదుబాయ్ ఫ్లైట్ 1073లో భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై గగనతలంలో జరిగిన దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. విమానాన్ని హైజాక్ చేయడానికి లేదా కూల్చివేయడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఒమన్ ఫస్ట్ ఆఫీసర్ (కోపైలట్ ) కెప్టెన్ స్మిత్ మచ్చర్ ను కత్తితో పొడిచాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన వెనుక ఉన్న పెద్ద కుట్రపై దర్యాప్తు చేయాలని కేంద్రం ఎన్ఐఏను ఆదేశించింది. దీంతో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఈ ఘటనకు తీవ్రమైన జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు ఉన్నాయని కేంద్రం పేర్కొన్న తర్వాత, జాతీయ దర్యాప్తు సంస్థ చట్టం 2008 కింద కేసు నమోదైంది.

ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ప్రయాణికుల కథనాల ప్రకారం.. విమానాన్ని హైజాక్ చేయడానికి లేదా కూల్చివేయడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా, విమాన ప్రయాణ సమయంలో ఫస్ట్ ఆఫీసర్ కెప్టెన్ మచ్చర్‌పై కత్తితో దాడి చేశాడు. అయితే, ప్రయాణికులు, సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని అడ్డుకున్నారు. ఈ దాడిలో కెప్టెన్ తల, చేతులపై తీవ్రమైన గాయాలయ్యాయి. ఆ తర్వాత విమానంలో ఉన్న ఇతర ఫ్లైదుబాయ్ పైలట్లు, వాయువ్య సౌదీ అరేబియాలోని తబూక్‌లో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో ఉదయం 10.45 గంటలకు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానం ల్యాండ్ అయిన అనంతరం సౌదీ అధికారులు ఫస్ట్ ఆఫీసర్‌ను అరెస్టు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భారత జాతీయుడైన మచ్చర్‌పై.. ఎన్ఐఏ చట్టం కింద షెడ్యూల్డ్ నేరాలుగా పరిగణించబడే యాంటీ-హైజాకింగ్ చట్టం, 2016, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం 1967 కింద నేరాలు జరిగినట్లు ఎఫ్ఐఆర్ లో తెలిపారు.














Click it and Unblock the Notifications
