వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందరికీ సొంతిల్లు..ఇదే ప్రధాని మోడీ లక్ష్యం

|
Google Oneindia TeluguNews

2022 కల్లా పేద ప్రజల కోసం 2 కోట్ల ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యాన్ని ప్రధాని మోడీ అతని ప్రభుత్వం నిర్దేశించుకున్నాయి. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అనేక కార్యక్రమాలను ప్రారంభించింది మోడీ ప్రభుత్వం. వీటి గురించి ప్రధాని బహిరంగ సభల్లో చెప్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఏమేరకు లక్ష్యాన్ని అందుకోగలిగిందో ఓసారి చూద్దాం.

100శాతం గ్రామాలకు విద్యుత్ : మోడీ ప్రభుత్వంలో వెలిగిపోయిన గ్రామీణభారతం

గత మూడేళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద భారత ప్రభుత్వం 51 లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటన్నిటినీ పట్టణ ప్రాంతాల్లో నిర్మించేందుకు నిర్ణయించింది సర్కార్. ఇందులో మొత్తం 28 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభమై వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయి. మరోవైపు ఇప్పటికే 8 లక్షల ఇళ్లు నిర్మాణం పూర్తయింది. అర్హులైన ప్రజలు అందులో నివసిస్తున్నారు కూడా. దీనికి అదనంగా కేంద్ర గృహనిర్మాణం మరియు పట్టణాభివృద్ధి శాఖ మరో 6లక్షల26వేల488 ఇళ్లు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించేందుకు అనుమతులు ఇచ్చింది. అనుమతి గత నెల ఇచ్చింది. ఈ పథకం ద్వారా చాలామంది మధ్యతరగతి కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయి.

PM Modis ambitious housing for all vision: What has been done so far?

ఇక రాష్ట్రాల విషయానికొస్తే ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందింది.ఉత్తర్‌ప్రదేశ్‌కు 2,34,879 ఇళ్లను మంజూరు చేయగా ఆంధ్రప్రదేశ్‌కు 1,40,559 ఇళ్లను కేంద్రం కేటాయించింది. ఇక పైన ప్రతిపాదించిన ఇళ్లులు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద అనుమతులు లభించిన ఇళ్ల సంఖ్య 60,28,608. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్‌కు 74,631, బీహార్‌కు 50,017,ఛత్తీస్‌గఢ్‌కు 30,371,గుజరాత్‌కు 29,185 ఇళ్లను కేటాయించారు. మహారాష్ట్రకు 22,265 ఇళ్లు, తమిళనాడుకు 20,794 ఇళ్లను మంజూరు చేసింది కేంద్రం. ఇక ఒడిషాలో 13,421 ఇళ్లు, త్రిపురాలో 9,778 మనిపూర్‌లో 2,588ఇళ్లు మంజూరు అయ్యాయి.

కేరళను వరదలు ముంచెత్తడంతో అక్కడ పనులు నెమ్మదించాయి. మళ్లీ కొత్త ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రప్రభుత్వం కోరింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ల నిర్మాణాలపై ప్రతిపాదనలు పంపాల్సిందిగా సూచించింది.ఇందులో వరదలతో సర్వం కోల్పోయిన వారు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి అర్హులైనవారిని చేర్చాలని సూచించింది. ఇళ్ల నిర్మాణాల కోసం ఇప్పటికే రూ. 486.87 కోట్లు నిధులు కేరళకు కేటాయించింది. అంతేకాదు ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది.

English summary
Prime Minister Narendra Modi has set an ambitious goal for his government of building 20 million affordable houses by 2022. The Modi led government has launched several initiatives to achieve this. PM Modi keeps talking about it in his rallies. Government of India approved 51 lakh houses under Pradhan Mantri Awas Yojana (Urban) in last 3 years Out of which 28 houses grounded and in various stages of completion. Further over 8 lakh houses have already been completed and nearly 8 lakh houses have been occupied by the beneficiaries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X