రాష్ట్రపతి ఎన్నికలు: ఓటు వేసిన పళనిసామి, పన్నీర్, స్టాలిన్, బహిష్కరించిన పీఎంకే !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీలోని మూడు వర్గాల ఎమ్మెల్యేలు, డీఎంకే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జోరుగా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికలను పీఎంకే పార్టీ బహిష్కరించింది.

రామ్ నాథ్ కోవింద్ కు వ్యతిరేకంగా దినకరన్ వర్గం ఎమ్మెల్యేల ఓటు ? శశికళతో మాట్లాడి !

సోమవారం ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ తమ వర్గం ఎమ్మెల్యేలతో కలిసి సచివాలయం చేరుకుని రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు.

సీఎం పళనిసామి, పన్నీర్ సెల్వం

సీఎం పళనిసామి, పన్నీర్ సెల్వం

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వేరువేరుగా ఎన్డీఏ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసింది. సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత సచివాలయం బయట పన్నీర్ సెల్వం, పళనిసామి వేరేవేరుగా మీడియాతో మాట్లాడారు.

కచ్చితంగా గెలుస్తారు

కచ్చితంగా గెలుస్తారు

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని పళనిసామి, పన్నీర్ సెల్వం ధీమా వ్యక్తం చేశారు. దినకరన్ వర్గం ఎమ్మెల్యే సచివాలయం చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

చాల సీక్రెట్, నో కామెంట్

చాల సీక్రెట్, నో కామెంట్

దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత మీడియాతో మాట్లాడటానికి ఆసక్తి చూపించలేదు. మీరు ఎవరికి ఓటు వేశారు ? అని మీడియా ప్రశ్నిస్తే కొందరు అది సీక్రెట్ అని, కొందరు నో కామెంట్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఎన్నికలు బహిష్కరణ

ఎన్నికలు బహిష్కరణ

తమిళనాడులోని పీఎంకే పార్టీ రాష్ట్రపతి ఎన్నికలను బహిష్కరించింది. పీఎంకే పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు అన్బుమణి రాందాస్ సోమవారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ మా పార్టీ రాష్ట్రపతి ఎన్నికలను బహిష్కరించిందని చెప్పారు.

కరుణానిధికి ప్రత్యేక వాహనం

కరుణానిధికి ప్రత్యేక వాహనం

డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎం. కరుణానిధి వైద్యల సలహాలు, సూచనల మేరకు సచివాలయం చేరుకుని ఓటు వెయ్యాలని నిర్ణయించారని ఆ పార్టీ నాయకులు చెప్పారు. కరుణానిధి సచివాలయం చేరుకోవడానికి ప్రత్యేక వాహనం సిద్దం చేశారని తెలిసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AIADMK rivalry faction O.Pannerselvam cast his vote in Chennai and said that BJP candidate Ramnath Kovind will win easily in the President election. PMK leader Anbumani Ramadoss boycotts presidential election.
Please Wait while comments are loading...