రెచ్చిపోతున్న నిత్యానంద: ప్రభుత్వ భూములపై కన్ను: పిచ్చిపట్టినట్లు శిష్యులు, పోలీసులు !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడులోని తిరువన్నామలైలో నిత్యానంద అలియాస్ నిత్యానంద స్వామి మళ్లీ భూముల్ని అక్రమించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నిత్యానంద శిష్యులు గుడారాలు వేసుకుని ఆయన ఫోటోలు పెట్టుకుని పూజలు చేస్తున్నారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ తో నటి కస్తూరి భేటీ: రాజకీయాల్లో ఎంట్రీ, ఎవ్వరూ పట్టించుకోలేదని !

నిత్యానంద శిష్యులు పిచ్చినట్లు ఫోటోలు పెట్టి పూజలు, భజనలు చేస్తున్నారు. నిత్యానంద శిష్యులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంతో తమిళనాడు ప్రభుత్వ అధికారులు, పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇటీవలే నిత్యానంద ఆక్రమించిన భూములను తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకునింది. అయితే నిత్యానంద మాత్రం మళ్లీ ఆ ప్రభుత్వ భూముల మీద కన్ను వేశారు.

Police chase away Nithyananda disciples from occupying site at Tiruvannamalai.

సీపీఎం నాయకులు ఫిర్యాదు చెయ్యడంతో తిరువన్నామలై కలెక్టర్ ఆదేశాల మేరకు నిత్యానంద ఆక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునింది. అయితే నిత్యానంద మాత్రం వెనక్కి తగ్డడం లేదు. తన శిష్యులతో కలిసి మళ్లీ అక్కడ గుడారాలు వేయించారు. పోలీసులు నిత్యానంద శిష్యులు వేసిన గుడరాలను తొలగించారు.

ఆంధ్రాలో అడుగుపెట్టిన స్టాలిన్: చంద్రబాబు ఇలా, తొడకొట్టి సీంకు సవాల్, దమ్ముంటే!

ఏడేళ్ల క్రితం నిత్యానంద తిరువన్నామలైలోని గిరి దక్షిణ మార్గంలో మూడెకరాలు ప్రభుత్వ భూములను ఆక్రమించారు. అప్పట్లో స్థానికులు ఎదురుతిరిగి ఆందోళకు దిగడంతో నిత్యానంద వెనక్కి తగ్గారు. ఇప్పుడు మళ్లీ తిరువన్నామలైలోని ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చెయ్యడంతో అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tamil Nadu Police chase away Nithyananda disciples from occupying site at Tiruvannamalai.
Please Wait while comments are loading...