బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్లోబల్ వార్మింగ్‌ను చల్లారుస్తోన్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..!!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సిలికాన్ సిటీ బెంగళూరులో వర్షాల తీవ్రత కొనసాగుతోంది. మంగళవారం రాత్రి కూడా భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. ప్రధాన మార్గాల్లో రెండు నుంచి మూడడుగుల మేర వర్షపునీరు నిలిచిపోయింది. స్కూటర్లు, కార్లు రోడ్లపై రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంది. చాలాచోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి. వరుసగా మూడోరోజు కూడా భారీ వర్షం పడటంతో జనం కష్టాలు మరింత పెరిగాయి.

రంగంలో ముఖ్యమంత్రి..

బెంగళూరు వరద పరిస్థితులను ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్వయంగా పరిశీలించారు. అర్ధరాత్రి మహదేవ్‌పూర్, బొమ్మనహళ్లి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వరద పరిస్థితిని పరిశీలించడానికి ఆయన జీపులో తిరిగారు. పంప్ హౌస్‌లను వరదలు ముంచెత్తడంతో దెబ్బతిన్న మంచినీటి సరఫరా బెంగళూరు వాటర్ అండ్ సీవరేజ్ బోర్డ్ అధికారులు పునరుద్ధరించారు. హెచ్ఏఎల్ ఎయిర్‌పోర్ట్ మార్గంలో ప్రయాణించవద్దని, ప్రత్యామ్నాయాలను చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు.

 ప్రత్నామ్నాయం..

ప్రత్నామ్నాయం..

పనత్తూరు రైల్వే బ్రిడ్జి ఇంకా వరదనీటిలోనే ఉన్నందున ఈ మార్గం గుండా వైట్‌ఫీల్డ్‌కు వెళ్లాలనుకునే ప్రయాణికులు వీలైనంత వరకు ఈ మార్గంలో రావొద్దని సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. విమానాల రాకపోకలు సాధారణంగా ఉన్నట్లు చెప్పారు.

తేజస్వి సూర్యపై..

తేజస్వి సూర్యపై..

ఈ పరిస్థితుల మధ్య భారతీయ జనతా పార్టీకి చెందిన బెంగళూరు సౌత్ లోక్‌సభ సభ్యుడు తేజస్వి సూర్య విమర్శలకు కేంద్రబిందువు అయ్యారు. ఓ హోటల్‌లో మసాలా దోసె తింటూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇవ్వాళ తాను పద్మనాభనగరలోని సాత్విక్ కిచెన్‌కు వచ్చానని, ఇన్‌స్టాగ్రామ్‌లో దోసె ఫొటోలు చూసి..టెంప్ట్ అయ్యానని, దాన్ని టేస్ట్ చేయడానికి వచ్చానని ఆయన ఈ వీడియోలో చెప్పడం కనిపించింది.

గ్లోబల్ వార్మింగ్..

గ్లోబల్ వార్మింగ్..


ఇప్పుడు తాజాగా సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్.. ఆయనపై సెటైర్లు సంధించారు. గ్లోబ్‌ను అభిషేకిస్తోన్న ఓ ఫొటోను ఈ ఉదయం ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. చల్లటి నీటిని గ్లోబ్‌పై పోయడం ద్వారా తేజస్వి సూర్య- గ్లోబల్ వార్మింగ్‌ను చల్లారుస్తోన్నారంటూ ఎద్దేవా చేశారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల బెంగళూరును అతి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయంటూ ఇదివరకు ఆయన చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా తప్పుపట్టారు.

English summary
Senior advocate Prashant Bhushan satires on BJP MP Tejaswi Surya solving the problem of Global warming.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X