Droupadi Murmu: టీచర్ నుంచి రాష్ట్రపతి స్థాయికి.. ద్రౌపది ముర్ము జీవితంలో ఎన్నో ఆటుపోట్లు..
భారత తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. అయితే ఆమె జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. సమస్యలపై పోరాటం చేస్తూ భారత ప్రథమ పౌరురాలయ్యారు. ద్రౌపది ముర్ము 1958, జూన్ 20న ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా బైడపోసిలో జన్మించారు. ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు టీచర్ గా పనిచేశారు.

ఆమె తన రాజకీయ జీవితాన్ని కౌన్సిలర్‌గా ప్రారంభించి,
తరువాత రాయంగ్‌పూర్ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ లేదా NAC వైస్-ఛైర్‌పర్సన్ అయ్యారు. ఒడిశాలోని భారతీయ జనతా పార్టీ, బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వం సమయంలో మార్చి 6, 2000 నుంచి ఆగస్టు 6, 2002 వరకు వాణిజ్యం, రవాణా శాఖకు స్వతంత్ర రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆగస్టు 6, 2002 నుంచి 2004 మే వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత గవర్నర్‌గా పనిచేశారు.

ఎన్నో ఒడిదోడుకులు
ద్రౌపది ముర్ము తన జీవితంలో ఎన్నో ఒడిదోడుకులు ఎదుర్కొన్నారు. 2010-2014 మధ్య ముర్ము కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ నాలుగేళ్లలో ముర్ము ఇద్దరు కుమారులు, ఆమె భర్త ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ముర్ము పెద్ద కొడుకు చనిపోవడానికి రెండు సంవత్సరాల ముందు ఆమె చిన్న కొడుకు చనిపోయాడు.

కొడుకు చనిపోయాక
ద్రౌపది ముర్ము తన పెద్ద కొడుకు చనిపోయాక ఆరు నెలలపాటు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందని ఆమె కోడలు శాక్యముని చెప్పారు. విషాదం తర్వాత మానసిక అగాధం నుంచి బయటపడేందుకు ఆధ్యాత్మికత వైపు మళ్లిందని వివరించారు. పెద్ద కుమారుడి మరణం తర్వాత, విషాదాన్ని ఎలా ఎదుర్కోవాలో తనకు అర్థం కావడం లేదని ముర్ము తనతో చెప్పారని ఆమె స్నేహితురాలు తెలిపింది.












Click it and Unblock the Notifications