ఆ అధికారం ఇక రాష్ట్ర ప్రభుత్వాలదే: రాష్ట్రపతి భవన్ నుంచి గెజిట్ జారీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలో మరో కీలక సవరణ చేసింది. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఇదివరకే ఆమోదించాయి. దాన్ని రాష్ట్రపతిభవన్‌కు పంపించాయి. తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ బిల్లును ఆమోదించారు. దీనికి సంబంధించిన గెజిట్‌ను జారీ చేశారు. దీనితో రాజ్యాంగంలో 105వ సవరణ చట్టం ఇక మనుగడలోకి వచ్చినట్టయింది.
ఈ చట్టం ప్రకారం- సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారిని గుర్తించే అధికారం ఇక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉంటుంది. ఓబీసీ, ఈబీసీలను గుర్తించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు బదలాయించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 338బీ క్లాజ్ (9), ఆర్టికల్ 342ఎలో సవరణలు చేసింది. ఈ రెండు ఆర్టికల్స్ ప్రకారం.. ఇప్పటిదాకా కూడా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండేది.

అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో వెనుకబడిన తరగతులను బీసీగా, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖల్లో ఓబీసీలుగా విభజిస్తూ వచ్చారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇందులో సవరణలు చేసింది. ఆర్టికల్ 342ఎలో మార్పులు చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ అవసరాలు, కార్యకలాపాల కోసం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారాన్ని బదలాయిస్తున్నట్లు పొందుపరిచింది.
దీనికి సంబంధించిన బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం ఈ నెల 11వ తేదీన వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. పెగాసస్ హ్యాకింగ్ ఉదంతంపై అప్పటిదాకా లోక్‌సభ, రాజ్యసభలను స్తంభింపజేస్తూ వచ్చిన కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష పార్టీల సభ్యులందరూ.. ఒక్కసారిగా కేంద్రానికి అండగా నిలిచారు. ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. ఉభయ సభల ఆమోదం పొందడంతో దీన్ని రాష్ట్రపతి భవన్‌కు పంపించింది పార్లమెంట్ సెక్రెటేరియట్.
తాజాగా- దీన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. ఈ బిల్లుపై సంతకం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ గెజిట్ జారీ చేసింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో అన్ని పార్టీలు దీనిపై తమ అభిప్రాయాన్ని తెలిపాయి. ఏ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకించలేదు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. కేంద్రానికి అనుకూలంగా నిర్ణయాన్ని తీసుకుంది.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications