Amritpal Singh : త్వరలో జనం ముందుకొస్తా- మరో వీడియో రిలీజ్ చేసిన అమృత్ పాల్ సింగ్

పంజాబ్ లో ప్రత్యేక ఖలిస్తాన్ నినాదంతో యువతను రెచ్చగొడుతూ కొన్నిరోజుల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన వివాదాస్పద ప్రచారకుడు అమృత్ పాల్ సింగ్ కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. అయినా అమృత్ పాల్ ఆచూకీ కనుక్కోవడంలో 80 వేల మంది పోలీసులు విఫలమయ్యారు. దీనిపై ఇప్పటికే కోర్టు కూడా పోలీసులకు అక్షింతలు వేసింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి పోలీసులకు చేతనైతే అరెస్టు చేయాలంటూ సవాల్ విసిరిన అమృత్ పాల్ సింగ్ ఇవాళ మరో వీడియో రిలీజ్ చేశాడు.

పంజాబ్ పోలీసులు తనను అరెస్ట్ చేయాలంటూ సవాల్ విసిరిన ఒక్క రోజు తర్వాత వీడియో రిలీజ్ చేసిన అమృత్ పాల్ సింగ్.. ఈసారి మాత్రం తాను త్వరలో ప్రపంచ ముందుకు రాబోతున్నట్లు తెలిపాడు. తాను పరారీలో ఉన్న వ్యక్తిని కాదని కూడా పేర్కొన్నాడు. తాను పారిపోయానని, తన సహచరులను విడిచిపెట్టానని భావించే వారు ఆ భ్రమలు తొలగించుకోవాలని కోరాడు. తనకు చావు భయం లేదన్నాడు. తనకు అరెస్టు భయం కూడా లేదని, జనం వదంతులు నమ్మొద్దన్నాడు.

punjabs radical preacher amritpal singh release new video, says appear before world soon

మరోవైపు అమృత్ పాల్ సింగ్ నిన్నటి వీడియోలో సమాజంలో సమస్యలపై చర్చించేందుకు విశ్వాసుల సమాజాన్ని చర్చలకు పిలవాలని సిక్కుల అత్యున్నత సంస్ధ జతేదార్ ను అమృత్ పాల్ కోరాడు. అయితే త్వరలో అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం లేదా భటిండాలోని తఖ్త్ శ్రీ దామ్‌దామా సాహిబ్‌లలో దేనిలోనైనా ప్రవేశించి అమృత్ పాల్ సింగ్ లొంగిపోతాడన్న వార్తలతో పోలీసులు అమృత్ సర్, బటిండా పరిసరాల్లో భద్రత పెంచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+