వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10 గంటలు విచారణ: రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం.. రేపు కూడా

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో సోమవారం 10 గంటల పాటు ప్రశ్నించారు. ఉద‌యం 11.30 గంట‌ల‌కు రాహుల్ గాంధీ ఈడీ కార్యాల‌యానికి వెళితే, మధ్యలో లంచ్ కోసం ఓ గంట పాటు బయటకు అనుమతించారు. తర్వాత మళ్లీ విచారణ కొనసాగి, రాత్రి 9.30 గంట‌ల‌కు ఆయ‌న ఈడీ కార్యాల‌యం నుంచి బ‌య‌ట‌కు పంపించారు.

ఆ లెక్క ప్రకారం రాహుల్‌ను ఏకంగా 10 గంట‌ల పాటు విచారించారు. తొలి రోజు సుదీర్ఘంగా సాగిన‌ విచార‌ణ‌లో భాగంగా ఈడీ అధికారులు రాహుల్ గాంధీపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన‌ట్లు స‌మాచారం. ఈడీ అధికారులు అడిగిన దాదాపుగా అన్ని ప్ర‌శ్న‌ల‌కు రాహుల్ లిఖిత‌పూర్వ‌కంగానే స‌మాధానాలు ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో రాహుల్ స‌మాధానాల‌ను ఆయ‌న వ్య‌క్తిగ‌త సాక్ష్యాలుగా ప‌రిగ‌ణించే దిశ‌గా ఈడీ అధికారులు నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

 Rahul Gandhi Questioned For Over 10 Hours

రేపు కూడా విచార‌ణ‌కు రావాలంటూ ఈడీ అధికారులు రాహుల్ గాంధీకి ఆదేశాలు జారీ చేశారు. తొలి రోజు విచార‌ణ ముగిసిన స‌మ‌యంలో ఈ మేర‌కు రాహుల్‌కు స‌మ‌న్లు అంద‌జేశారు. దీంతో మంగ‌ళ‌వారం కూడా రాహుల్ గాంధీ ఈడీ విచార‌ణ‌కు హాజ‌రు కానున్నారు.

అంతకుముందు ఢిల్లీలో ఈడీ కార్యాల‌యం ముందు కేసీ వేణుగోపాల్ నిర‌స‌న‌కు దిారు. ఆయనను అరెస్ట్ చేసి తుగ్ల‌క్ రోడ్ పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు ఈడ్చుకెళ్లిన‌ట్లుగా తీసుకెళ్లారు. ఆయనను తీసుకెళ్లే విజువల్ స్పష్టంగా కనిపించింది. ఆయన చోటా, మోటా నాయకుడు కాదు.. కానీ అతని పట్ల ఇలా ప్రవర్తించడం విమర్శలకు దారితీసింది. అయితే పెనుగులాట‌లో ఆయ‌న చొక్కా చిరిగిపోయింది.

English summary
Congress's Rahul Gandhi was questioned for more than nine hours today in an alleged money laundering case connected to the National Herald newspaper.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X