రాహుల్ గాంధీ స్ట్రాటేజీ టీం ఇదే: సచిన్ నుంచి రమ్య దాకా

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న రాహుల్ గాంధీ ఈ ఏడాది మే నెలలో తన సొంత జట్టును ఏర్పాటు చేసుకున్నారు. ఈ బృందంలో సగటు వయస్సు 42 ఏళ్లుగా ఉంది. వారికి అప్పగించిన బాధ్యతలను నేతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీ సోమవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నామినేషన్ దాఖలు చేశారు.

  BJP Vs Congress : యువతను ఆకర్షించే పనిలో మాజీ ఎంపి, నటి రమ్య

  ఆయన ఎన్నిక లాంఛనమే. ఇక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడమే ఆలస్యం. గుజరాత్ ఎన్నికల తర్వాత కర్నాటక ఎన్నికలు ఆయనకు పరీక్షగా మారనున్నాయి. 2019 ఎన్నికల నాటికి కొత్త ఉత్సాహం తీసుకు వచ్చి రాహుల్‌ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్వీళ్లూరుతోంది. ఆ దిశలో రాహుల్ టీం పని చేస్తోంది.

  బీజేపీని-మోడీని ఢీకొట్టగలరా: రమ్య రాకతో మారిన సీన్! ఆమె ముందు సవాళ్లు

  జ్యోతిరాదిత్య సింధియా

  జ్యోతిరాదిత్య సింధియా

  మధ్యప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్య సింధియా పార్లమెంటు సభ్యుడుగా ఉన్నారు. గ్వాలియర్ రాజ కుటుంబీకులు. మొదటి నుంచి రాహుల్ గాంధీ విశ్వసించే వారిలో ఒకరు. సింధియా వయస్సు 46 ఏళ్లు. వచ్చే మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఆయన సీఎం రేసులోనూ ఉన్నారని అంటున్నారు.

  సచిన్ పైలట్

  సచిన్ పైలట్

  రాజస్థాన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సచిన్ పైలట్. రాజస్థాన్ నుంచి లోకసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాహుల్ గాంధీ నమ్మిన బంటులో ఒకరు ఈయన. సచిన్ పైలట్ వయస్సు 40 ఏళ్లు.

  రణదీప్ సుర్జేవాలా

  రణదీప్ సుర్జేవాలా

  హర్యానా ఎమ్మెల్యే, ఏఐసీసీ సమాచార విభాగం ఇంచార్జ్ రణదీప్ సుర్జేవాలా. మంచి వాక్చాతుర్యం కలిగిన నాయకులు. రాహుల్ గాంధీకి నిత్యం టచ్‌లో ఉండే కొద్ది మంది నేతల్లో సుర్జేవాలా ఒకరు. వ్యూహరచనలో ఈయనది కీలక పాత్ర. సుర్జేవాలా వయస్సు 50 ఏళ్లు.

  రమ్య అలియాస్ దివ్యస్పందన

  రమ్య అలియాస్ దివ్యస్పందన

  కర్నాటకకు చెందిన మాజీ ఎంపీ. కన్నడ నటి కూడా. కాంగ్రెస్ సోషల్ మీడియాను చూసుకుంటున్నారు. 2013లో మాండ్య నుంచి లోకసభకు గెలుపొందారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. సోషల్ మీడియా కోసం ఆమెను స్వయంగా రాహుల్ ఎంపిక చేశారు. ఆమెకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. రాహుల్ టీంలో అతి చిన్న వయస్సు రమ్యదే. వయస్సు 35.

  రాజీవ్ సతవ్

  రాజీవ్ సతవ్

  మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇద్దరు ఎంపీలలో రాజీవ్ సతవ్ ఒకరు. ఏఐసీసీ కార్యదర్శి కూడా. మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాజీవ్ సతవ్.. రాహుల్ అజెండాను పార్లమెంటులో వినిపిస్తుంటారు. ఇప్పటి వరకు 11 ప్రయివేటు బిల్లులు ప్రవేశ పెట్టారు. ఈయన వయస్సు 45 ఏళ్లు.

  అమరీందర్ సింగ్ రాజా

  అమరీందర్ సింగ్ రాజా

  పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే అమరీందర్ సింగ్ రాజా. యూత్ కాంగ్రెస్ చీఫ్‌గా రాహుల్ గాంధీని ఆకట్టుకున్నారు. ఈయన వయస్సు 40 ఏళ్లు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Will Rahul Gandhi’s revitalised approach help Congress win Lok Sabha Elections 2019?

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి