వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ మార్క్ రాజకీయం ప్రారంభం! సీనియర్లకు ఉద్వాసన తప్పదా?

కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీకి కొత్త జవసత్వాలను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలకు విశ్రాంతి ఇవ్వాలని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీకి కొత్త జవసత్వాలను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. వినూత్న ప్రయోగాలతో దూసుకెళ్ళేందుకు ప్రణాళిక రచిస్తున్నారు.

Recommended Video

Rahul Gandhi Coronation : కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ తొలి ప్రసంగం

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పార్టీలో పెను మార్పులు తేవాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో యువ నేతల పనితీరును గమనించిన రాహుల్ ఇకపై తన వ్యూహ బృందంలో యువరక్తాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

rahul-gandhi


రణదీప్ సుర్జీవాలా, అజయ్ మాకెన్‌లలో ఒకరు రాహుల్ రాజకీయ కార్యదర్శిగా నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రణదీప్ సుర్జీవాలా కాంగ్రెస్ మీడియా సెల్ ఇన్‌ఛార్జ్ కాగా, అజయ్ మాకెన్ ఢిల్లీ పీసీసీ చీఫ్‌గా ఉన్నారు.

కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలకు విశ్రాంతి ఇవ్వాలని రాహుల్ గాంధీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సోనియా గాంధీ నేతృత్వంలో పని చేసిన కోర్ గ్రూప్ సభ్యులు రాహుల్ గాంధీ హయాంలో కొనసాగే అవకాశం లేదని తెలుస్తోంది.

ఇలా పదవులు కోల్పోయేవారిలో రాజ్యసభ సభ్యుడు బీకే హరి ప్రసాద్, సీనియర్ నేత అంబికా సోనీ, లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్‌తోపాటు మరికొందరు ఉన్నట్లు సమాచారం.

English summary
AICC New President Rahul Gandhi preparing plans to rebuild the party with youth. He wants to give send off to some senior leaders it seems. The senior leaders who worked in core group under the leadership of Sonia Gandhi per the past many years are in immediate threat. Rajyasabha Member BK Hari Prasad, Senior Woman Leader Ambika Soni, Congress Leader in Lok Sabha Mallikarjuna Kharge, gulam Nabi Azad should quit their posts in near future it seems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X