మైనర్ బాలిక పై అత్యాచారం చేశారు, వాట్సాప్ ఫ్రోపైల్ ఫోటోలు నిందితులను పట్టించాయి

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబాయి :సామాజిక మాథ్యమాల ద్వారా మంచి, చెడు ఉంది,అయితే తాము ఏ రకంగా ఈ సామాజిక మాథ్యమాలను ఉపయోగించుకొంటే అవి అదే రకంగా పనికివస్తాయి. అయితే ముంబాయిలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి తప్పించుకొన్న నిందితులను వాట్సాప్ ఫోటోలే పట్టించాయి.వాట్సాప్ ఫ్రోపైల్ ఫోటోల ఆధారంగా నిందితులను బాలిక గుర్తించింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ముంబాయిలోని నీరుల్ పరిధిలోని షిరవానే గ్రామంలో ఓ మహిళ బ్యూటీ పార్లర్ లో పనిచేస్తోంది. ఆమెకు పన్నెండేళ్ళ కూతురు కూడ ఉంది. ఆ మహిళ తల్లికి ఆరోగ్యం బాగాలేదు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళుతోంటే తాను కూడ ఆసుపత్రికి వస్తానని మైనర్ బాలిక చెప్పింది. ఆసుపత్రికి ఎందుకంటూ మైనర్ బాలికపై తల్లి కోప్పడింది. దీంతో ఆ బాలిక అలిగి ఇంటి నుండి వెళ్ళిపోయింది.

rapists traceout with whats app profile photos

ఇంటి నుండి వెళ్ళిన బాలిక కోపర్ కైరానే వద్దకు వెళ్ళి సెక్టార్ 19 లోని గార్డెన్ లో ఉంది. ఈ విషయాన్ని మరుసటి రోజు ఇద్దరు రియల్ ఏస్టేట్ వ్యాపారులు గుర్తించారు. మిథున్ కైలాష్ మహాత్రే, అమిత్ నరేష్ వేతా లు ఆ బాలిక దగ్గరకు వచ్చి ఆమెకు ఆశ్రయం కల్పిస్తామని చెప్పి తీసుకెళ్ళారు. వేతా ఇంట్లో ఆ బాలికపై అత్యాచారం చేశారు. నవంబర్ 24వ, తేదిన ఆ బాలికను వైషి స్టేషన్ వద్ద వదిలేసి వెళ్ళారు.

స్టేషన్ నుండి ఎక్కడి వెళ్ళాలో బాలికకు అర్థం కాలేదు. అయితే నీరుల్ కు సమీపంలోని సార్సోల్ గ్రామానికి బస్సులో వెళ్ళింది. ఆ గ్రామంలో బాలిక బంధువులు ఉన్నారు. ఈ బాలిక తల్లి తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదుచేసింది. బంధువుల ఇంటికి బాలిక చేరడంతో పోలీసులకు సమాచారం అందించారు బంధువులు.

తనపై ఇద్దరు రియల్ ఏస్టేట్ వ్యాపారులు అత్యాచారం చేసిన ఘటనను బాలిక పోలీసులకు చెప్పింది. బాలిక చెప్పిన ప్రదేశానికి వెళ్ళి పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వారి ఫోన్ నెంబర్లు, అందులోని వాట్సాప్ ఫ్రోఫైల్ పోటోలను తనిఖీ చేశారు . వాట్సాప్ ఫ్రోఫైల్ ఫోటోల ఆధారంగా మైనర్ బాలిక ఇద్దరు నిందితులను గుర్తించింది. బాలిక చెప్పిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
two real estate business persons rape on minor girl in mubai.police arrested them with the whats app profile photos.12 years old minor girl escape from house with angry on her mother. the girl stay in a garden night, next day two realtors identify this girl, take her a house raped, on nov 24, they drop the girl wify railway staion. girl went to relatives village, police trace out girl, girl tell to police what happend to her. police arrested both realtors with the help of whats app profile photos.
Please Wait while comments are loading...