రతన్ టాటా ప్రతీకారం కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా ?
వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తన సుదీర్ఘ జీవితాన్ని ఎంతో నిరాడంబరంగా, అందంగా, విలువలతో జీవించేందుకు ప్రయత్నించారు. ఇదే క్రమంలో రతన్ టాటా మరణం నేపథ్యంలో ఆయన సాధించిన విజయాలతో పాటు ఆయన దాతృత్వ గుణంపైనా తీవ్రంగా చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఆయన గురించి తెలియని ఎన్నో అంశాలు కూడా బయటికి వస్తున్నాయి. కానీ ఈ తరానికి తెలియని టాటా అందమైన ప్రతీకారం గురించి తెలుసుకుందాం..
రతన్ టాటా జీవిత చరిత్ర తెలుసుకోండి..!
దేశంలోనే తొలి లక్ష రూపాయల కారుగా నానోను తీసుకొచ్చిన విషయం చాలా మందికి తెలుసు. కానీ 1998లో తొలి పాసింజర్ హ్యాష్ బ్యాక్ కారు టాటా ఇండికాను తెచ్చేందుకు కూడా రతన్ టాటా ఎంతో శ్రమించారు. భారత్ వంటి దేశాల్లో ప్రయాణికుల అవసరాల్ని దష్టిలో ఉంచుకుని తయారు చేసిన తొలి దేశీయ హ్యాష్ బాగ్ కారు అది. అయితే ఇది ఇక్కడి జనాన్ని ఆరంభంలో అంతగా ఆకట్టులేకపోయింది. దీంతో నష్టాల్ని భరించలేక టాటా మోటార్స్ దీన్ని అమెరికా కంపెనీ ఫోర్డ్ కు అమ్మాలని భావించారు.

దీంతో ఇండికా కొనాలనే ఉద్దేశంతో బోంబే హౌస్ లోని టాటా హెడ్ క్వార్టర్స్ కు ఫోర్ట్ ప్రతినిధులు వచ్చారు. తొలి దపా చర్చల తర్వాత అమెరికాలో రెండో దశ చర్చలకు రతన్ టాటాతో పాటు టాటా ప్రతినిధులు కూడా వెళ్లారు. అయితే అక్కడ మాత్రం వారికి అవమానాలు తప్పలేదు. డెట్రాయిట్ లో మూడు గంటల పాటు జరిగిన ఈ భేటీలో ఫోర్డ్ ప్రతినిధి.. టాటా మోటార్స్ ప్రతినిధులను ఉద్దేశించి మీకేమీ తెలియదు, పాసింజర్ కార్ల విభాగం ఎందుకు మొదలుపెట్టారంటూ నీచంగా మాట్లాడారు.
ఇండికా కొనడం ద్వారా మీకు మేలు చేస్తున్నామన్నారు. దీంతో రతన్ టాటా అర్ధాంతరంగా బయటికి వచ్చేశారు.
కానీ ఆ తర్వాత అదే ఇండికాను పట్టుదలగా ప్రయత్నించి మార్పులు చేసి రతన్ టాటా సక్సెస్ అయ్యారు. దీంతో ఇండికాను ఎవరికీ అమ్మాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ పదేళ్ల తర్వాత అమెరికాలో వచ్చిన ఆర్దిక మాంద్యం కారణంగా ఫోర్డ్ కంపెనీ కుదేలైంది. దీంతో తమ బ్రాండ్లు జాగ్వార్, ల్యాండ్ రోవర్ లు అమ్ముకోవాల్సిన పరిస్ధితికి వచ్చింది. విషయం తెలుసుకున్న రతన్ టాటా ఫోర్డ్ ప్రతినిధుల్ని రప్పించుకుని వాటిని టేకోవర్ చేస్తానని చెప్పేసారు. దీంతో టాటా చేసిన మేలును ఫోర్డ్ ప్రతినిధులు బహిరంగంగానే చెప్పుకున్నారు. అదీ టాటా అందమైన ప్రతీకారం.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications