‘గాంధీ హత్య’లో నాలుగో బుల్లెట్: 4వారాలు వాయిదా వేసిన సుప్రీం

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: మహాత్మగాంధీ హత్య కేసులో నాలుగో బుల్లెట్ అంశం తెర మీదకు రావటంతో కేసు పునర్విచారణ చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్‌‌పై సుప్రీంకోర్టు సోమవారం స్పందించింది. దీనిపై అమికస్‌ క్యూరీగా నియమించబడిన అమరిందర్‌ శరన్‌ మరింత సమయం కావాలని కోరటంతో నాలుగు వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది.

ఇరు వర్గాల నుంచి స్పష్టమైన సమాచారం సేకరించిన తర్వాత... ఈ పిటిషన్‌ న్యాయపరమైనదేనా? అని తేల్చాల్సిందిగా అమరిందర్‌ను కోర్టు కోరింది. అభినవ్ భారత్ సంస్థకు ట్రస్టీ అయిన రీసెర్చర్ పంకజ్ ఫడ్నీస్ ఈ పిటిషన్ దాఖలుచేసిన విషయం తెలిసిందే.

Re-probe of Mahatma Gandhi murder: Amicus curiae seeks more time to reply

కాగా, గాడ్సే తుపాకీ నుంచి వచ్చిన బుల్లెట్లతో కాకుండా మరో బుల్లెట్‌తోనే గాంధీ ప్రాణాలు వదిలారంటూ.. కేసును మళ్లీ దర్యాప్తు చేయాలంటూ ఈ పిటిషన్ దాఖలుచేశారు.

అయితే, ఈ పిటిషన్‌పై గాంధీ మునిమనవడు తుషార్‌ గాంధీ స్పందిస్తూ.. ఇదంతా అవాస్తవమని వాదిస్తున్నారు. ఆ అభ్యర్థన అర్థరహితమని ఆయన తోసిపుచ్చుతున్నారు. 1948, జనవరి 30న న్యూఢిల్లీలో మహాత్మాగాంధీని నాథూరాం వినాయక్ గాడ్సే అనే వ్యక్తి తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Supreme Court on Monday adjourned the hearing of re-investigation of Mahatma Gandhi assassination case for four weeks as amicus curiae Amrender Sharan sought more time to reply.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి