కేజ్రీవాల్ కు షాక్: ''రూ.97 కోట్లు కట్టాల్సిందే''

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్ జీ అనిల్ బైజల్ తోనూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు తలనొప్పులు తప్పేలా కన్పించడం లేదు.ఆమ్ ఆద్మీ పార్టీ నుండి రూ.97 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంఎం కుట్టిని బైజల్ ఆదేశించారు.

సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఈ ప్రకటనలు ఉల్లంఘించాయని ఆయన చెప్పారు.ప్రభుత్వ ప్రకటనల్లో ముఖ్యమంత్రుల ఫోటోలు ఉండకూడదని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.రూ.97 కోట్లు చెల్లించేందుకు పార్టీకి నెలరోజుల పాటు గడువు ఇచ్చింది.

recover Rs 97 crore from aap in 30 days for ads

ఈ ప్రకటనలన్నింటికీ రాష్ట్ర ఖజానానుండి డబ్బు చెల్లించారు.అయితే లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చిన నోటీసులు ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీకి అందినట్టులేవు. అయితే ఇప్పటివరకు ముఖ్యమంత్రికి గానీ, ఉప ముఖ్యమంత్రికి గానీ ఈ నోటీసుల గురించి ఎలాంటి సమాచారం లేదని తమకు ఏమైనా సమాచారం వస్తే దీనిపై వ్యాఖ్యానిస్తామని ఆప్ పార్టీ వర్గాలు చెప్పాయి.

ప్రభుత్వ ప్రకటనలలో కేవలం ప్రధానమంత్రి, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫోలు మాత్రమే ఉండాలని సుప్రీం కోర్టు 2016లో జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది.

ఈ నిర్ణయాన్ని పున:సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం అసోం, పశ్చిమబెంగాల్ , తమిళనాడు, కర్ణాటక సుప్రీంకోర్టులను ఆశ్రయించాయి. దీని వల్ల దేశంలో సమాఖ్య వ్యవస్థకు ముప్పు కలిగే అవకాశం ఉందని వాదించాయి.

దీంతో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు తన ఉత్తర్వులను వాయిదా వేసింది. ముఖ్యమంత్రులు,గవర్నర్లు, మంత్రుల ఫోటోలను కూడ అనుమతిస్తామని చెప్పింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
in a setback to the Kejriwal dispensation, Lt Governor Anil Baijal has directed that Rs 97 crore be recoverd from AAP that was allegedly “splurged” by the city .
Please Wait while comments are loading...