ఎన్నికలు: 'రెడ్ మార్క్'పై కొందరు ముస్లీంల ఆందోళన, ఇదీ విషయం
గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి ఉంది. ఎన్నికల సమయంలో అహ్మదాబాదులోని పలువురి ఇళ్ల పైన ఎర్రటి రంగుతో క్రాస్ మార్క్ గుర్తులు కలకలం రేపుతున్నాయి.
అహ్మదాబాద్: గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి ఉంది. ఎన్నికల సమయంలో అహ్మదాబాదులోని పలువురి ఇళ్ల పైన ఎర్రటి రంగుతో క్రాస్ మార్క్ గుర్తులు కలకలం రేపుతున్నాయి.
ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ముస్లీం ఫ్యామిలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాము ఉంటున్న ప్రాంతాలను గుర్తు పట్టేలా, తమ సొసైటీల వద్ద అడ్డుగీతలు పెట్టారని కొందరు ముస్లీంలు పోలీసులకు లేఖ రాశారు.

దీనిపై పోలీసులు విచారణ జరిపారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను సేకరించేందుకు గుర్తుగా ఆ ఎర్ర గీతలు వేయించినట్లు తేలింది.
కేవలం ముస్లీం సొసైటీ గేట్ల వద్దే కాకుండా హిందువులు ఉంటున్న చోట కూడా ఈ క్రాస్ గుర్తులు పెట్టారు. ఈ విషయాన్ని పోలీసు అధికారు వెల్లడించారు.












Click it and Unblock the Notifications