IndiGo: ఇండిగోకు డీజీసీఏ మరో షాక్..! ఆ నలుగురిపై వేటు..!

దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు విమానయాన సంస్థగా పేరున్న ఇండిగో తాజాగా భారీ సంక్షోభం ఎదుర్కొంది. పైలట్లను డ్యూటీల ప్రకారం నియమించడంలో వైఫల్యం, సాంకేతిక కారణాలు, ఇలా పలు సమస్యలతో భారీ ఎత్తున విమాన సర్వీసులు రద్దు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఇండిగోతో పాటు కేంద్ర ప్రభుత్వం, ఎయిర్ లైన్స్ రెగ్యులేటర్ అయిన డీజీసీఏ కూడా ఇరుకునపడ్డాయి.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇండిగోపై చర్యలు ప్రారంభించిన పౌర విమానయానశాఖ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) ఇవాళ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండిగోలో ఆపరేషన్స్ ఇన్ స్పెక్టర్లుగా వ్యవహరిస్తున్న నలుగురిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇండిగోలో వీరు ప్రయాణికుల భద్రతతో పాటు విమాన కార్యకలాపాల పర్యవేక్షణ చేస్తున్నారు. ఇండిగో తలెత్తిన సంక్షోభాన్ని సకాలంలో పరిష్కరించకుండా ప్రయాణికుల ఇబ్బందులకు కారణమయ్యారన్న కారణంతో వీరిపై వేటు పడింది.

Regulator Suspends 4 Inspectors Overseeing IndiGo

ఇండిగో ఎయిర్ లైన్స్ లో సిబ్బంది వినియోగం, ప్రయాణికులకు టికెట్ మొత్తాల రిఫండ్స్ సహా వివిధ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి డీజీసీఏ గురుగ్రామ్‌లోని క్యారియర్ కార్యాలయంలో రెండు బృందాలను నియమించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే పలు కీలక ఎయిర్ పోర్టుల్లో ఇండిగో విమానాల సంఖ్యను కూడా డీజీసీఏ తగ్గించినట్లు తెలుస్తోంది. పైలట్లపై ఆంక్షల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇండిగో బ్లాక్ మెయిల్ చేసేందుకే ఈ కృత్రిమ సంక్షోభం సృష్టించిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో డీజీసీఏ వరుస చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+