"అజిత్ పవార్ విమాన ప్రమాదం పెద్ద కుట్ర.. సాక్ష్యం ఇదే.."
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణంపై ఎన్సీపీ (ఎస్పీ) నేత రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. ఈ ఘటనపై తక్షణమే అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు తాజాగా ముంబైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రోహిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సమావేశంలో ఎన్సీపీ (ఎస్పీ) నేత రోహిత్ పవార్ మాట్లాడుతూ.. అజిత్ పవార్ ప్రయాణించిన విమాన ప్రమాదం కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగింది కాదని.. అది ఒక ప్రణాళికాబద్ధమైన కుట్ర అని సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు కీలక విషయాలను బహిర్గతం చేశారు. అజిత్ పవార్ వాస్తవానికి జనవరి 27 రాత్రి కారులో పుణే వెళ్లాల్సి ఉందని.. కానీ ఓ నాయకుడి ఒత్తిడి వల్ల ప్రయాణం వాయిదా పడిందన్నారు. దాంతో మరుసటి రోజు ఉదయం విమానంలో వెళ్లాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు ఘటన జరిగిన రోజు విమానాన్ని నడిపిన కెప్టెన్ సుమిత్ కపూర్ ట్రాక్ రికార్డ్ పైనా రోహిత్ పవార్ పలు ప్రశ్నలు సంధించారు. విమానాన్ని నడపాల్సిన రెగ్యులర్ పైలట్ లను కాదని.. గతంలో క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొన్న కెప్టెన్ సుమిత్ కపూర్ ను చివరి నిమిషంలో ఎందుకు నియమించారని ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో మద్యం సేవించినందుకు పైలట్ సుమిత్ ను మూడేళ్లు సస్పెండ్ చేశారని గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో ఈ విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి సీఐడీకి పూర్తి అధికారం ఉండదని.. అందువల్ల అమెరికాకు చెందిన NTSB లేదా బ్రిటన్ కు చెందిన AAIB వంటి అంతర్జాతీయ సంస్థల ద్వారా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక జనవరి 28, 2026న ముంబై నుండి బారామతి విమానం బారామతి విమానాశ్రయం సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు పైలట్లు, భద్రతా సిబ్బంది సహా ఐదుగురు మరణించారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications