వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త వెయ్యి రూపాయల నోటు వస్తోంది, రద్దైన నోట్ల విలువ రూ.15.44లక్షలు

కొత్త సిరీస్ తో కొత్త వెయ్యి రూపాయాల నగదునోటును ప్రవేశపెట్టేందుకు ఆర్ బి ఐ కసరత్తు చేస్తోంది.గత ఏడాది నవంబర్ మాసంలో కేంద్ర ప్రభుత్వం ఐదువందలు, వెయ్యి రూపాయాల నగదు నోట్లను రద్దు చేసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:కొత్త వెయ్యి రూపాయాల నగదు నోటును ప్రవేశపెట్టేందుకుగాను ఆర్ బి ఐ ప్రయత్నాలను ప్రారంభించింది. గత ఏడాది నవంబర్ లో ఐదువందలు, వెయ్యి రూపాయాల నగదు నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం తర్వాత వెయ్యి రూపాయాల నోటు ప్రస్తుతం చలామణిలో లేదు.దీంతో కొత్త వెయ్యి రూపాయాల నోటును ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది.

దేశంలో నల్లధనాన్ని నిర్మూలించేందుకుగాను పెద్ద నగదు నోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఐదువందలు, వెయ్యి రూపాయాల నగదు నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొంది.

అయితే పెద్ద నగదునోట్ల రద్దు కారణంగా కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేశారు. వెయ్యి రూపాయాలకు బదులుగా రెండు వేల రూపాయాల నగదును ప్రవేశపెట్టారు. మరో వైపు కొత్త ఐదువందల రూపాయాల నోటును కూడ ప్రవేశపెట్టారు.

కాని, రద్దు చేసిన వెయ్యి రూపాయాల స్థానంలో కొత్తగా వెయ్యి రూపాయాల నోటును మాత్రం ప్రవేశపెట్టలేదు. అయితే వెయ్యి రూపాయాల నగదు నోటును ప్రవేశపెట్టేందుకుగాను ఆర్ బి ఐ రంగం సిద్దం చేస్తోంది.

కొత్త వెయ్యి రూపాయాల నోటును ప్రవేశపెట్టేందుకు ఆర్ బి ఐ కసరత్తు

కొత్త వెయ్యి రూపాయాల నోటును ప్రవేశపెట్టేందుకు ఆర్ బి ఐ కసరత్తు

గత ఏడాది వెయ్యి రూపాయాల నగదు నోట్లను రద్దుచేసింది కేంద్రం. అయితే ఆనాటి నుండి వెయ్యి రూపాయాల నోటు దేశంలో చలామణిలో లేదు. రెండువేల నగదు నోటు వల్ల కొంత కాలం దేశంలో చిల్లర సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ తరుణంలో ఐదువందల రూపాయాల కొత్త నోటును ప్రవేశపెట్టింది ఆర్ బి ఐ.అయితే వెయ్యి రూపాయాల నోటు విషయమై ఇంకా స్పష్టత రాలేదు.అయితే తాజాగా కొత్త వెయ్యిరూపాయాల నగదు నోటును ప్రవేశపెట్టేందుకుగాను ఆర్ బి ఐ రంగం సిద్దంచేసింది.

కొత్త వెయ్యి రూపాయాల నోట్ల ముద్రణ

కొత్త వెయ్యి రూపాయాల నోట్ల ముద్రణ

కొత్త వెయ్యి రూపాయాల నగదు నోట్ల ముద్రణను ఆర్ బి ఐ తన ముద్రణ కార్యాలయాల్లో ప్రారంభించిందని జాతీయ ప్రసార సాధనాలు ఉటంకిస్తున్నాయి. అయితే కొత్త వెయ్యి రూపాయాల నగదు నోట్లు ఎప్పటికీ మార్కెట్లోకి వస్తాయనే విషయమై ఇంకా స్పష్టత లేదు. రద్దైన పాత నోట్ల లోటును భర్తీ చేసేందుకుగాను కొత్త వెయ్యి రూపాయాల నోట్లను ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.

కరెన్సీ కొరతను అధిగమించేందుకుగాను

కరెన్సీ కొరతను అధిగమించేందుకుగాను

కొత్త వెయ్యి రూపాయాల నగదు మార్కెట్లోకి రావడం ద్వారా లోటు నగదును భర్తీ చేయవచ్చనే అభిప్రాయాన్ని ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.గత ఏడాది జనవరి మాసంలోనే కొత్త వెయ్యి రూపాయాల నగదు నోట్లు మార్కెట్లోకి వస్తాయనే ప్రచారం సాగింది.అయితే ఇంతవరకు మార్కెట్లోకి కొత్త నగదు నోట్లు మాత్రం రాలేదు.కొత్త సిరీస్ తో కొత్త వెయ్యి రూపాయాల నగదు నోట్లను ఆర్ బి ఐ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

రద్దైన వెయ్యి నోట్ల విలువ రూ.15.44 లక్షలు

రద్దైన వెయ్యి నోట్ల విలువ రూ.15.44 లక్షలు

గత ఏడాది నవంబర్ మాసంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద నగదు నోట్లను రద్దు చేసింది. ఐదువందలు, వెయ్యి రూపాయాల నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. రద్దుచేసిన వెయ్యి రూపాయాల నోట్ల విలువ సుమారు రూ.15.44 లక్షలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే కొత్త వెయ్యి రూపాయాల కరెన్సీ మార్కెట్ లోకి వస్తే ఇబ్బందులు తప్పే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

English summary
The Reserve Bank of India and the government have finalised plans to launch a new series of 1,000 rupee notes to replace the ones that were withdrawn, Indian Express reported citing a government official they didn’t identify.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X