వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంపర్ ఆఫర్: 120 మంది డిజిటల్ పేమెంట్స్ ప్రచారకర్తలు, బీమ్ యాప్ రికార్డు

డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు గాను కేంద్రం రూ.153.5 కోట్లను కేటాయించింది. రాను రాను డిజిటల్ చెల్లింపులపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని నీతి ఆయోగ్ సిఈఓ అమితా

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రజలను నగదు రహిత లావాదేవీల వైపు మళ్ళించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోంది.అయితే డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహకాల కోసం కేంద్రం రూ.153.5 కోట్లను కేటాయించింది. ఈ నిధుల ద్వారా ప్రోత్సాహకాలను అందించనున్నారు.

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపుల వైపుకు ప్రజలను మళ్ళించేందుకుగాను కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ప్రత్యేకంగా కేంద్రం రూ.153.5 కోట్ల నిధులను కేటాయించింది.

నగదు రహిత చెల్లింపులు చేసిన పది లక్షమందికి నగదు ప్రోత్సాహకాలను అందించనుంది. వీరిలో 120 మందికి రూ. లక్ష రూపాయాల నగదు బహుమతులను గెలుచుకొన్నారు. వీరిని డిజిటల్ పేమెంట్స్ ప్రచార కర్తలుగా నియమించుకోనున్నట్టుగా నీతి ఆయోగ్ సిఈఓ అమితాబ్ కాంత్ చెప్పా,రు.
నగదు రహిత చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన భీమ్ యాప్ లో మార్పులు చేర్పులు చేసింది ప్రభుత్వం. అన్ని రకాల ఫోన్ల వినియోగదారులకు ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది.దీంతో ఈ యాప్ రికార్డు బద్దలు కొడుతోంది.

భీమ్ యాప్ రికార్డు

భీమ్ యాప్ రికార్డు

దేశీయ డిజిటల్ పేమెంట్స్ యాప్ భీమ్ రికార్డులు బద్దలు కొడుతోంది. పూర్తి సురక్షితంగా, వేగవంతమైన డిజిటల్ లావాదేవీల కోసం ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ మాసంలో ఈ యాప్ ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీనిని ఇప్పటివరకు 1.70 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ కాలంలో ఇంత ఎక్కువమంది డౌన్ లౌడ్ చేసుకొన్న యాప్ ఇదే.దీంతో ఇది ప్రపంచ రికార్డును సృష్టించిందని నీతి ఆయోగ్ సిఈఓ అమితాబ్ కాంత్ చెప్పారు.

అన్ని వర్షన్లకు భీమ్ యాప్

అన్ని వర్షన్లకు భీమ్ యాప్

తొలుత ఆండ్రాయిడ్ పోన్ల వినియోగదారులు మాత్రమే భీమ్ యాప్ ను ఉపయోగించుకొనే వెసులుబాటు ఉంది. అయితే ఈ యాప్ లో మార్పులు చేర్పులు చేసింది కేంద్రం.అన్నిరకాల ఫోన్ల వినియోగదారులకు ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చేందుకుగాను మార్పులను తీసుకువచ్చింది.నవంబర్, డిసెంబర్ పీరియడ్ లో యూఎస్ఎస్ డీ ట్రాన్సక్షన్లను 45 శాతం పెరిగాయని అమితాబ్ కాంత్ చెప్పారు.

డిజిటల్ పేమెంట్ కార్యకర్తల నియామకం

డిజిటల్ పేమెంట్ కార్యకర్తల నియామకం

డిజిటల్ పేమెంట్ కార్యకర్తలను నియమించుకోవాలని కేంద్రం భావిస్తోంది. నగదు రహిత లావాదేవీలు చేసిన ప్రభుత్వం నుండి ప్రోత్సాహకాలను పొందిన 120 మందిని ప్రభుత్వం డిజిటల్ పేమెంట్స్ కార్యకర్తలుగా నియమించుకోనుంది. వీరంతా ఇప్పటికే కేంద్రం నుండి రూ. లక్ష రూపాయాల నగదును ప్రోత్సాహకాలుగా తీసుకొన్నారు. ప్రతి వెయ్యి నుండి రెండు వేల మందిని డిజిటల్ లావాదేవీల వైపు వీరు మళ్ళించనున్నారు.

ప్రోత్సహాకాల కోసం రూ.153.5 కోట్లు

ప్రోత్సహాకాల కోసం రూ.153.5 కోట్లు

ప్రజలను డిజిటల్ లావాదేవీల వైపు ప్రజలను మొగ్గుచూపేలా కేంద్రం ప్రోత్సాహాకాలను ఇస్తోంది.అంతేకాకుండా వ్యాపారులు కూడ ప్రజలను డిజిటల్ చెల్లింపుల వైపుకు మొగ్గుచూపేలా వ్యాపారులకు కూడ ప్రభుత్వం పథకాలను చేపట్టింది. ఈ మేరకు ప్రోత్సహాకాల కోసం ప్రత్యేకంగా రూ.153.5 కోట్లను కేంద్రం కేటాయించింది.
లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపారి యోజన లాంటి పథకాలను కూడ కేంద్రం తెచ్చింది. దేశ వ్యాప్తంగా 9.8 లక్షల మంది విజేతల్లో 9.2 మంది వినియోగదారులుండగా, 56 వేల మంది వ్యాపారులున్నారు. వీరిలో 120 మంది లక్ష రూపాయాల బహుమతిని గెలుచుకొన్నట్టు అమితాబ్ కాంత్ మంగళవారం నాడు చెప్పారు.

English summary
Rs.153.5 crores alloted For digital payment incentives said niti aayog ceo amitabh kant on tuesday.digital lucky grahak yojana and digidan vyapari yojana schemes implemented he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X