వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆర్ఎస్ఎస్ నాయకుడిపై ,తీవ్రవాదుల కాల్పులు , గన్‌మెన్ మృతి
ఎన్నికల వేళ, జమ్ము అండ్ కాశ్మీర్ లో తీవ్రవాదులు స్థానిక ఆర్ఎస్ఎస్ నాయకుడిపై కాల్పులు జరిపారు. దీంతో ఆయనకు స్వల్పగాయాలు కాగా గన్‌మెన్ మృతి చెందారు.

జమ్ము అండ్ కశ్మీర్ లో మరోసారి తీవ్రవాదులు విరుచుపడ్డారు. కాశ్మీర్ లోని కిష్ట్వర్ జిల్లాకు చెందిన స్థానిక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చెందిన చంద్రకాంత్ శర్మ అనే నాయకుడి అసుపత్రిలో ఉండగా తీవ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే కాల్పుల సమయంలో ఆయన గన్‌మెన్ ప్రతిఘటించారు. దీంతో ఆయనపై కూడ కాల్పులు జరపడతంతో అక్కడిక్కడే గన్‌మెన్ మృతి చెందగా ఆర్ఎస్ఎస్ నాయకుడికి తీవ్రగాయలయ్యాయి. దీంతో ఆయన్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా పోలీసులకు తీవ్రవాదులకు మధ్య కోద్దిరోజులుగా కాల్పులు జరుగుతున్న విషయం తెలిసిందే .