ప్రద్యుమన్ హత్య ట్విస్ట్: ఆరోజు ఏం చేశానంటే?.. నిందితుడు చెప్పిన కొత్త విషయాలు

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ప్రద్యుమన్ ఠాకూర్ హత్య కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. మొదట స్కూల్ బస్ కండక్టరే నిందితుడన్న ఆరోపణలు వెల్లువెత్తగా.. ఆ తర్వాత 11వ తరగతి విద్యార్థే అసలు నిందితుడని సీబీఐ అధికారులు వెల్లడించారు.

ఇంట్లో ఎప్పుడూ కొట్టుకోవడమే!: 'ప్రద్యుమన్ హత్య'లో నిందితుడు బయటపెట్టిన సంచలన విషయాలు

కస్టడీలోకి తీసుకుని విచారించిన నేపథ్యంలో.. వాంగ్మూలంలోను హత్యా నేరాన్ని నిందితుడు ఒప్పుకున్నట్టు సీబీఐ అధికారులు తెలిపారు. అయితే బాలల సంరక్షణ అధికారి ఎదుట మాత్రం నిందితుడు మాట మార్చాడు.

జరిగింది అది కాదు: ఆధారాలు ఎలా మాయం అయ్యాయ్?, ప్రద్యుమన్ హత్య వెనుక సంచలనాలు..

నాకూ తమ్ముడున్నాడు:

నాకూ తమ్ముడున్నాడు:

నిందితుడి చేత బలవంతంగా వాంగ్మూలం చెప్పించారన్న ఆరోపణల నేపథ్యంలో.. బాలల సంరక్షణ అధికారి విచారణ తీరును పరిశీలించారు. జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశాల మేరకు ఆయన నిందితుడి వద్దకు వెళ్లారు.

బాలల సంరక్షణ అధికారి నిందితుడితో మాట్లాడిన క్రమంలో.. హత్యా నేరాన్ని బాలుడు ఖండించినట్టు సమాచారం.తాను హత్య చేయలేదని నిందితుడు పేర్కొన్నాడు. అంతేకాదు, అధికారులు తనను కొట్టి, బలవంతపెట్టి ఒప్పించారని ఆరోపించాడు.

తనకూ ఒక తమ్ముడు ఉన్నాడని, తన తమ్ముడు లాంటి వాడిని ఎందుకు హత్య చేస్తానని నిందితుడు ప్రశ్నించడం గమనార్హం. దీంతో సీబీఐ అధికారులు షాక్ తిన్నారు. బాలుడు మాట మార్చడంతో కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు.

టార్చర్ పెడుతున్నారు:

టార్చర్ పెడుతున్నారు:

నిందితుడి తల్లిదండ్రులు సీబీఐ అధికారులు తమ కుమారుడిని చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. బలవంతంగా అతని చేత వాంగ్మూలం చెప్పించారని, తలకిందులుగా వేలాడదీసి హింసించారని తండ్రి ఆరోపించారు.

వాంగ్మూలంలో నిందితుడు వెల్లడించిన విషయాలకు, బాలల సంరక్షణ అధికారి ఎదుట వెల్లడించిన విషయాలకు అసలు పొంతన కుదరడం లేదు. ఘటన జరిగిన రోజు తానేం చేసింది వివరిస్తూ పలు కొత్త విషయాలు వెల్లడించాడు.

ఆరోజు ఇలా.. మ్యూజిక్ రూమ్ వైపు వెళ్లానని!

ఆరోజు ఇలా.. మ్యూజిక్ రూమ్ వైపు వెళ్లానని!

ఆరోజు మొదట గుడికి వెళ్లి తన నాయనమ్మకు శ్రాద్ద కర్మలు నిర్వహించానని నిందితుడు తెలిపినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఉదయం 8గం.కు స్కూలుకు వెళ్లినట్టు పేర్కొన్నాడు. అయితే ఇంతలో ఓ స్నేహితుడు తనను ఆగమని చెప్పడంతో.. స్కూల్లోని వాటర్ కూలర్ వద్ద అతని కోసం వేచి చూసినట్టు చెప్పాడు.

అక్కడే రెండు నిముషాల పాటు తాను వేచి చూశానని, ఎంతకీ అతను రాకపోవడంతో పక్కనే ఉన్న మ్యూజిక్ రూమ్ వైపు వెళ్లానని చెప్పాడు. ఇటీవలే మ్యూజిక్ టీచర్ తన తండ్రిని కోల్పోవడంతో పరామర్శించడానికి వెళ్లినట్టు తెలిపాడు.

రక్తపు వాంతులు చేసుకున్నాడని

రక్తపు వాంతులు చేసుకున్నాడని

మ్యూజిక్ రూమ్ లాక్ చేసి ఉండటంతో అక్కడి నుంచి తిరిగి వెనక్కి వెళ్లి మిత్రుడి కోసం చూశానని పేర్కొన్నాడు. అప్పటికీ మిత్రుడు రాకపోవడంతో వాష్ రూమ్ వైపు వెళ్లానని చెప్పుకొచ్చాడు. అక్కడ ఓ బాలుడు రక్తం వాంతులు చేసుకోవడం కనిపించిందన్నాడు. వెంటనే బయటకు పరిగెత్తుకొచ్చి తోటమాలి హర్పాల్ కు విషయం చెప్పానని అన్నాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The juvenile accused of murdering Class 2 student Pradhyumn Thakur at Gurgaon’s Ryan International School has retracted the confession he was said to have made before investigators, sources told HT on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి