షాక్: ఎస్‌బిఐ డెబిట్ కార్డుల బ్లాక్, మోసాలను అరికట్టేందుకేనా!
న్యూఢిల్లీ: ఎస్‌బిఐ ... కొందరు ఖాతాదారుల డెబిట్ కార్డులను శాశ్వతంగా బ్లాక్ చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన సమాచారాన్ని కష్టమర్లకు అందించింది.
ఏ కారణాలతో ఈ కార్డులను బ్లాక్ చేయాల్సివచ్చిందనే విషయాన్ని ఎస్‌బిఐ తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది.భద్రతా కారణాల నేపథ్యంలో మ్యాగ్‌ఫ్రైప్ డెబిట్ కార్డులను ఈవీఎం చిప్ డెబిట్ కార్డులతో భర్తీ చేయాలని ఎస్‌బిఐ నిర్ణయించింది.
మ్యాగ్నిటిక్‌ప్రైప్ ఆధారిత ఎటిఎం, డెబిట్ కార్డులను ఈవీఎ చిప్, పిన్ ఆధారిత మోడల్‌లోకి మార్చాలని గత ఏడాది ఆర్‌బిఐ బ్యాంకులను ఆదేశించింది.మ్యాగ్నిటక్ ఫ్రైప్ ఆధారిత ఎటిఎం , డెబిట్ కార్డులతో జరుగుతున్న మోసాల నుండి రక్షించడానికి ఈవీఎం చిప్, పిన్ ఆధారిత మోడల్స్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

2017 సెప్టెంబర్ 30వ, తేది వరకు అన్ని బ్యాంకులు, వైట్ లేబుల్ ఎటిఎం ఆపరేటర్లు చిప్ కార్డు ఆధారిత ఎటిఎం మోడల్స్‌లోకి మారాల్సిందేనని తెలిపింది.
ఈ కార్డులను మార్చుకోవడానికి ఖాతాదారులు వెంటనే బ్యాంకును కాంటాక్ట్ చేయాలని లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ద్వారా కార్డులను మార్చుకోవాలని బ్యాంకు సూచించింది.ఈవీఎం చిప్ డెబిట్ కార్డులను బ్యాంకు ఉచితంగా కష్టమర్లకు అందించనుంది.
డెబిట్ కార్డును దగ్గర పట్టుకొని చూస్తే కార్డు వెనకాల నల్లటి మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఉంటుంది లేదా ముందువైపు చిప్ ఉంటుంది. లేదా ఈ రెండు ఉండే అవకాశం ఉంది. ఈ కార్డులు సిగ్నేచర్ ఆాదారితంగా ఉంటాయి. చిన్న ఆయస్కాంతాలతో ఈ స్ట్రిప్ తయారౌతోంది. దీనిలో అకౌంట్ సమాచారం ఉంటుంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications