Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘వారెంట్ వెనక్కి తీసుకోలేం, తొందరెందుకు.. విచారిస్తాం కదా?’: సుప్రీంకోర్టులో కర్ణన్ కు చుక్కెదురు

కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌కు సుప్రీంకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. తనపై జారీచేసిన అరెస్టు వారెంట్ ను వెనక్కి తీసుకోవాలని కర్ణన్‌ చేసిన విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తిరస్

న్యూఢిల్లీ: కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌కు సుప్రీంకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. తనపై జారీచేసిన అరెస్టు వారెంట్ ను వెనక్కి తీసుకోవాలని కర్ణన్‌ చేసిన విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.

జస్టిస్‌ కర్ణన్‌ కు కోర్టు ధిక్కార కేసులో సుప్రీంకోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించడం, ఆయన్ని వెంటనే అరెస్టు చేసి జైలు శిక్ష అమలు చేయాలని కోల్‌కతా పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే.

SC slams Justice Karnan over 'repeated pleas' to recall arrest order

అయితే ఈ కేసులో తాను బేషరుతుగా క్షమాపణ చెబుతానని జస్టిస్‌ కర్ణన్‌ ఇప్పటికే న్యాయస్థానాన్ని అభ్యర్థించినా.. దాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. తాజాగా తనపై అరెస్టు ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని, కేసులో విచారణను వేగవంతం చేయాలని జస్టిస్‌ కర్ణన్‌ తన తరఫున న్యాయవాది ద్వారా పిటిషన్‌ వేయించారు.

అయితే ఈ అభ్యర్థనను కూడా సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అరెస్టు ఆదేశాలను వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేసింది. అంతేకాకుండా,'విలువైన కోర్టు సమయాన్ని మీరు వృథా చేస్తున్నారు. తొందరెందుకు, మీ పిటిషన్‌ వరుస క్రమంలో వచ్చినప్పుడు విచారణ చేస్తాం కదా.. ' అంటూ చీవాట్లు పెట్టింది.

మరోవైపు జస్టిస్‌ కర్ణన్‌ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు. కోర్టు తీర్పుకు కొద్ది గంటల ముందే ఆయన కోల్‌కతా విడిచి వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. జస్టిస్‌ కర్ణన్‌ చెన్నైలోనే ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది చెబుతున్నప్పటికీ.. మాత్రం పోలీసులకు ఆయన దొరకడంలేదు. జస్టిస్‌ కర్ణన్‌ ఆచూకీ కోసం తమిళనాడు, బంగాల్‌ రాష్ట్రాల పోలీసులు విస్త్రతంగా గాలింపు చేపట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+