వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంతకెళ్తుండగా ప్రమాదం.. నదిలో పడవ బోల్తా, బోటులో 80 మంది, వాహనాలు కూడా...

|
Google Oneindia TeluguNews

కూరగాయాలు, ఇంటికి అవసరమైన వస్తువులు కొనుక్కుందామని సంతకెళితే ప్రమాదం కబళించింది. తమకు తెలిసిన వారితో సరుకులు కొందామని వెళ్లి నది మధ్యలో పడవ బోల్తాపడటంతో గల్లంతయ్యారు. వీరిలో కొందరు ఈత వచ్చిన వారు ఒడ్డుకు రాగా.. మరికొందరు జాడ తెలియలేదు. వెంటనే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ రంగంలోకి దిగింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది.

అసోం జిల్లా సోనిట్‌పూర్ జియా భారలీ నదీలో పడవ బోల్తా పడింది. ఇందులో 80 మంది ప్రయాణిస్తున్నారు. బిహియా గావ్ నుంచి లాల్ టాపుకు వెళ్తున్నారు. లాల్ టాపులో ప్రతీ గురువారం సంత ఉంటుంది. మార్కెట్ కోసం వెళ్తుండగా పడవ బోల్లా పడింది. తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు వస్తుంటారు. అలాగే బిమియా గావ్ నుంచి కూడా 80 మంది బయల్దేరారు.

Several missing after boat carrying 80 passengers capsize in river

నదీ మధ్యలో పడవ వెళ్తుంది. పడవలో 80 మందితోపాటు.. కొన్ని టూ వీలర్ వాహనాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో పడవ బోల్తా పడింది. దీంతో ఈత వచ్చిన కొందరు ఎలాగోలా ఒడ్డుకు చేరుకోగలిగారు. మిగతా వారు మాత్రం గల్లంతయ్యారు. పడవ ప్రమాదం విషయం తెలుసుకొని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ రంగంలోకి దిగింది. నదిలో గల్లంతైన వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తోంది.

English summary
boat capsized in Jia Bharali river, several people are being reported to be missing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X