ఆత్మరక్షణ షరా మామూలే: వాజ్‌పేయి నుంచి మోదీ.. శివరాజ్ వరకు ఇదే దారి

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఆత్మరక్షణలో ఉన్నప్పుడు అధికార పక్షం ఎదురుదాడికి దిగడం షరా మామూలే. ఇటీవల తెలంగాణలో మంథనిలో ఒక యువకుడి హత్యకు వ్యతిరేకంగా యావత్ రాష్ట్రంలోని విపక్షాలు ఆందోళనకు దిగితే అధికార పార్టీ ఎమ్మెల్యే.. శాంతి దీక్ష చేపట్టారు. నిజానిజాలు నిగ్గు తేల్చాలని అప్పట్లో డిమాండ్ చేశారు. కానీ బీజేపీ అందులో తక్కువేం తినలేదు. 1998 నుంచి ఇప్పటివరకు బీజేపీదీ ఇదే దారి. ప్రస్తుతం
రుణాల మాఫీ, గిట్టుబాటు ధర కోసం మధ్యప్రదేశ్ రైతులు ఆదివారం నుంచి రత్లాంలో నిరాహార దీక్ష చేపట్టాన్ని దీనికి ప్రతిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన సతీమణి సాధనాసింగ్‌తో కలిసి రైతులకు పోటీగా నిరాహారదీక్ష ప్రారంభించారు.
భోపాల్‌లోని దసరా మైదాన్‌లో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ రైతుల పంటకు లాభదాయకమైన ధరను ఇస్తామని వాగ్దానం చేశారు. ఇదే హామీ 11 రోజుల క్రితం రైతులు నిరవధిక ఆందోళన చేస్తున్నప్పుడు ఎటువెళ్లిందని రాజకీయ విశ్లేషకులు, విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి నెలకొనే వరకు తన దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు.

శివరాజ్ సింగ్ దీక్షపై విపక్షాలు ఇలా

శివరాజ్ సింగ్ దీక్షపై విపక్షాలు ఇలా

రైతులు చాలా బాగానే ఉన్నారని, ఆందోళన చేసే వారే లేరని తొలి నుంచి అధికార బీజేపీ నేతలు, ఆ రాష్ట్ర మంత్రులు చెప్తూ వచ్చారు. తీరా రైతుల ఆందోళన తీవ్రతరమయ్యే సరికి సంఘ విద్రోహ శక్తులు పాల్గొంటున్నాయని ఎదురు దాడికి దిగారు. ప్రభుత్వం ఎంతకు దిగి రాకపోవడంతో పట్టణాలకు తరలిస్తున్న పాలను రోడ్లపైనే పారబోశారు. కూరగాయలు చెత్తడబ్బాల్లో పడేశారు. అయినా సర్కార్ పట్టించుకోకపోవడంతో విధ్వంసానికి దారి తీయడంతో పోలీసులు నేరుగా కాల్పులు జరిపితే ఐదుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఒకవైపు రైతులు తమ డిమాండ్ల కోసం రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ డ్రామాకు తెరతీశారని విపక్షాలు ఆరోపించాయి.

సీఎం శివరాజ్ దీక్షపై కాంగ్రెస్ ఇలా

సీఎం శివరాజ్ దీక్షపై కాంగ్రెస్ ఇలా

ఈ నిరాహారదీక్ష తాను చేసిన తప్పిదాలకు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పశ్చాత్తాపమో లేక ఆడుతున్నది నాటకమో ప్రజలకు చెప్పాలి అని రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి కేకే మిశ్రా డిమాండ్ చేశారు. గాంధీగిరి చేస్తున్నట్టు చెప్తున్న సీఎం బాపూ బొమ్మ కింద దీక్షకు కూర్చోలేదని, దీక్షకు ముందు కనీసం గాంధీ విగ్రహానికి పూలదండ కూడా వేయలేదని ఎత్తి చూపారు. సీఎం దీక్షను చేపట్టడానికి బదులు మంద్‌సౌర్ వెళ్లి బాధిత రైతులను పరామర్శించి ఉంటే బాగుండేదని బీజేపీ మిత్ర పక్షం శివసేన అభిప్రాయపడింది. రైతుల సమస్యలన్నీ పరిష్కారమయ్యే వరకు సీఎం తన దీక్షను విరమించకూడదని సూచించింది.

శివరాజ్ సింగ్ సహచర వ్యవసాయ మంత్రి అలా

శివరాజ్ సింగ్ సహచర వ్యవసాయ మంత్రి అలా

రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని ‘శాంతి దీక్ష' చేపట్టిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హామీలిస్తుంటే.. రైతుల రుణాలు మాఫీ చేసే ప్రసక్తే లేదని మధ్యప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి గౌరీశంకర్ బిసేన్ తేల్చి చెప్పారు. మరోవైపు రైతుల‌కు పంట రుణాల నుంచి విముక్తి క‌ల్పించ‌డం అసాధ్య‌మ‌ని ఆ రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి జీఎస్ బైస‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. రైతుల నుంచి ఎటువంటి వడ్డీని వసూలు చేయనప్పుడు రుణాలు ఎందుకు మాఫీ చేయాలని ప్రశ్నించారు. కానీ గౌరిశంకర్ బిసేన్‌కు తెలియని విషయం ఒకటి ఉన్నది. బ్యాంకులు ఇచ్చే రుణాలన్నింటికీ వడ్డీ వసూలు చేస్తుంటాయి. కానీ ఈ విషయం తెలిసినా తెలియనట్లు మంత్రి గౌరిశంకర్ బిసేన్ అంటున్నారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అన్నదాతను ఏమార్చేందుకు మధ్యప్రదేశ్ సీఎం అని వ్యాఖ్యలు

అన్నదాతను ఏమార్చేందుకు మధ్యప్రదేశ్ సీఎం అని వ్యాఖ్యలు

మరోవైపు సీఎం రుణ మాఫీ గురించి ఆలోచిస్తున్నారని అధికార వర్గాలు సమాచారం. రైతు బిడ్డనని చెప్పుకునే శివరాజ్ సింగ్ చౌహాన్ నిజంగా పంట రుణాల మాఫీ గురించి ఆలోచిస్తే కేవలం రూ.2000 కోట్ల భారమే పడుతుందని అంచనా వేస్తున్నట్లు ఆ వార్తల సారాంశం. తెలంగాణలోనే రూ.17 వేల కోట్ల రుణ మాఫీ అమలుజేస్తే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎంత ఉంటుందన్నదని ఆలోచించాల్సిన విషయమే. పంట రుణ మాఫీ చేసే పేరిట అన్నదాతను ఏమార్చేందుకు ప్రయత్నిస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

మోదీ 2002లో ఇలా శాంతిమంత్రం

మోదీ 2002లో ఇలా శాంతిమంత్రం

2002లో గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలుబోగి దగ్ధం తర్వాత జరిగిన ఊచకోతలో వేల మంది ప్రజలు మరణించారు. ఒక సామాజిక వర్గంలో అభద్రతాభావం నెలకొన్నది. దీనికి రాజధర్మం పాటిస్తూ నాటి సీఎం నరేంద్రమోదీ రాజీనామా చేయాలని అప్పటి ప్రధాని వాజ్ పేయి వ్యాఖ్యానించారు. కానీ అప్పట్లో డిప్యూటీ ప్రధానిగా ఉన్న లాల్ క్రుష్ణ అద్వానీ అడ్డుకున్నారని వార్తలొచ్చాయి. పార్టీ అధి నాయకత్వం అసంత్రుప్తి, ప్రజల్లో వ్యతిరేకత, ఊచకోత ప్రభావం నుంచి బయట పడేందుకు నాడు నరేంద్రమోదీ కూడా గుజరాత్ అంతటా ‘శాంతియాత్ర' నిర్వహించారు. నాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగాల్సి ఉన్నా.. రాష్ట్రపతి పాలన విధించకుండానే ఆరు నెలల పాటు వాయిదా వేశారు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు మొదలు ఇప్పటివరకు గుజరాత్ రాష్ట్రంలో ప్రతిసారి నరేంద్రమోదీ సారథ్యంలో బీజేపీ విజయం సాధిస్తూనే వచ్చింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్ రాష్ట్రంలో దాదాపు అన్ని లోక్‌సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.

లక్నో వేదికగా వాజ్‌పేయి దీక్ష

లక్నో వేదికగా వాజ్‌పేయి దీక్ష

1998లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించడంతో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న వేళ అది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న జగదంబికాపాల్‌ను అప్పటి ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీలు కలిసి సీఎంగా కూర్చొబెట్టాయి. అంతకుముందు సీఎంగా ఉన్న కల్యాణ్ సింగ్.. లక్నో హైకోర్టుకు వెళ్లారు. దీంతో కాంపొజిట్ ఫ్లోర్ టెస్ట్‌కు ఆర్డరేసింది. అసెంబ్లీ వేదికగా సభా విశ్వాసాన్ని చూరగొనేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా, మరోవైపు అప్పటి బీజేపీ ప్రధాని అభ్యర్థి అటల్ బిహారీ వాజ్‌పేయి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. తెర వెనుక.. లాభసాటి వ్యవహారాలు జోరుగా సాగాయి. అసెంబ్లీలో కల్యాణ్ సింగ్ ప్రభుత్వం సభా విశ్వాసం పొందే వరకు వాజ్ పేయి దీక్ష సాగింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bhopal: Various farmers' organisations from around the country will be assembling in Ratlam on Sunday to support the ongoing unrest in Madhya Pradesh and pay tributes to the farmers killed in police firing.
Please Wait while comments are loading...