Budget 2026: చిన్న పెట్టుబడిదారులకు పెద్ద ఊరట..! 15G/15H ఇస్తే చాలు..!
దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉండే చిన్న పెట్టుబడిదారులు లేదా చిన్న పన్ను చెల్లింపుదారులకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్ లో వార్షిక బడ్జెట్ (budget 2026) సమర్పణ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా పన్ను చెల్లింపుల విషయంలో వారు ఎదుర్కొంటున్న ఓ ఇబ్బంది విషయంలో ఊరటనిచ్చారు. ఇకపై వీరికి ఆటోమేటెడ్ ట్యాక్స్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు వీలుగా కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుతం బహుళ కంపెనీలలో సెక్యూరిటీలు కలిగి ఉన్న పన్ను చెల్లింపుదారులు ప్రతిసారీ ఆదాయపు పన్ను అధికారులకు వీటి వివరాలు సమర్పించి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ఈ ప్రక్రియ నుంచి వారికి విముక్తి కల్పిస్తూ నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం ప్రకటించారు. వారు ఇకపై డిపాజిటరీలు (ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్) దగ్గర ఫారమ్ 15G లేదా ఫారమ్ 15Hను సమర్పిస్తే చాలు. వారే ఆయా ఫామ్ లను సంబంధిత కంపెనీలకు నేరుగా వాటిని పంపిస్తారు.

తద్వారా ఆటోమేటెడ్ ప్రక్రియ ద్వారా వారికి పన్ను విధింపు సులభతరం అవుతుంది. అలాగే వారికి తక్కువ పన్ను లేదా నిల్ డిడక్షన్ సర్టిఫికెట్లు జారీ అవుతాయి. ఈ మేరకు డిపాజిటరీలకు కేంద్రం ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ కొత్త విధానం అమల్లోకి తీసుకురావడం ద్వారా చిన్న పన్ను చెల్లింపుదారులు లేదా చిన్న పెట్టుబడిదారులకు ఊరటనిస్తున్నట్లు ఆర్ధికమంత్రి
తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆదాయపు పన్ను చట్టంలోనూ ఈ మేరకు మార్పులు చేయబోతున్నారు.












Click it and Unblock the Notifications