అందరం ప్రార్థిద్దాం.. అతను బతకాలని, సోనూ సూద్ పిలుపు
సోనూసూద్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నాడు. ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న యువకుడి ప్రాణాలను బతికించేందుకు ప్రార్థిద్దాం అని అభిమానులకు పిలుపునిచ్చారు. ఢిల్లీకి చెందిన హితేశ్ శర్మ అనే యువకుడు ఈ ఏప్రిల్ నుంచి కరోనాతో పోరాడుతున్నాడు. అతని ఊపిరితిత్తులు కూడా దెబ్బతిన్నాయి. ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్.. అతన్ని ప్రాణాలతో కాపాడేందుకు ఎయిర్ అంబులెన్స్ ద్వారా నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
నగరంలోని యశోద ఆస్పత్రిలో శర్మకు ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ జరుగుతోంది. ఈ క్రమంలో సోనూసూద్ ట్వీట్ చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌లో తీసుకొచ్చిన హితేశ్ శర్మకు యశోద ఆస్పత్రిలో లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ జరుగుతోంది. అతను ఏప్రిల్ నుంచి కరోనాతో పోరాడుతున్నాడని..పేర్కొన్నారు. ఆ యువకుడు ప్రాణాలతో బయటపడాలని మనందరం ప్రార్థించాల్సిన అవసరం ఉందని అభిమానులకు సోనూసూద్ పిలుపునిచ్చారు.

మరోవైపు సోనూసూద్ ఇప్పటికి దాదాపు రూ. 30 కోట్లకు పైగా సొంత డబ్బు ఖర్చు చఏశారు. చేసిన మంచి పనులే కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది. ఇప్పుడు ఆయన క్రేజ్‌ని సినిమా వాళ్లు క్యాష్ చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. అందుకే సోనూసూద్‌కు అవకాశాలు చాలానే ఇస్తున్నారు. రూ.3 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. తెలుగులో అవకాశాలు ఎక్కువగా రావడంతో హైదరాబాద్‌లోనే ఉండాల్సి వస్తుంది. అందుకే హైదరాబాద్‌లో ఓ సొంతింటిని కొనుక్కోవాలని చాలా రోజుల కింద ఫిక్స్ అయ్యాడు.
బంజారాహిల్స్‌లో రూ.10 కోట్లతో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేయబోతున్నట్టు సమాచారం. సోనూసూద్‌కి ఇప్పటికే ముంబైలో ఓ ఇల్లు ఉంది. అక్కడే ఒక హోటల్ కూడా ఉంది. కరోనా సమయంలో పేదల కోసం దాన్ని క్వారంటైన్ సెంటర్‌గా కూడా మార్చాడు.