వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సిమ్ అవసరం లేదు, ఇక వైఫై బ్రాడ్ బ్యాండ్ తోనే ఫోన్ కాల్స్..'

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మొబైల్ నెట్ వర్క్ సిగ్నల్స్ సరిగా పనిచేయడం లేదని చింతిస్తున్నారా?.. ఇకపై అలా చింతించాల్సిన పనిలేదు. ఇంటర్నెట్ టెలిఫోన్ కాల్స్ ప్రతిపాదనలకు మంగళవారం కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు బ్రాడ్‌బ్యాండ్‌తో మొబైల్‌ ఫోన్లకు, ల్యాండ్‌లైన్స్ కు కాల్స్‌ చేసుకునేలా ప్రతిపాదనలు రూపొందాయి.

గత అక్టోబర్‌లోనే టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్‌ ఈ ప్రతిపాదనలను రూపొందించింది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే ఆఫీసులో లేదా ఇంట్లో ఉన్న వై-ఫై బ్రాడ్‌బ్యాండ్‌తో ఫోన్ కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త ప్రతిపాదనల నేపథ్యంలో ఇకనుంచి సిమ్ అవసరం లేని కొత్త మొబైల్ నంబర్స్ ను టెలికాం కంపెనీలు ఆఫర్ చేయనున్నాయి.

Soon, use broadband to call landline, mobile numbers

ఇంటర్నెట్‌ టెలిఫోనీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఈ సర్వీసులను యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కాల్‌ డ్రాప్స్‌ సమస్యతో బాధపడుతున్న వినియోగదారుల కోసం ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. టెలికాం మంత్రిత్వ శాఖ నుంచి దీనికి ఆమోదం లభించడంతో.. రిలయన్స్‌జియో, బీఎస్‌ఎన్‌, ఎయిర్‌టెల్‌ లాంటి టెలికాం ఆపరేటర్లు ఇంటర్నెట్‌ టెలిఫోనీ సర్వీసులను ప్రారంభించే అవకాశం ఉంది.

కాగా, ఈ కొత్త వైఫై ద్వారా ఫోన్ కాల్ సౌకర్యం అందుబాటులోకి రావడం యూజర్లకు ఎంతో మేలు చేస్తుందని ట్రాయ్ పేర్కొంది. టెలికాం సిగ్నల్స్ సరిగా లేనప్పటికీ.. వైఫై విషయంలో మాత్రం ఆ ఢోకా ఉండదంటున్నారు. డౌన్‌లోడ్‌ యాప్‌, సర్వీసు ప్రొవైడర్‌ ఒకే ఆపరేటర్‌ది అయితే నెంబర్‌ మార్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

English summary
Stuck in a bad signal area, or getting the dreaded sign that there is no mobile network at all? Soon you'll be able to latch on to your home or office wi-fi broadband to make calls to mobile phones as well as landlines, with the government on Tuesday approving a proposal to allow internet telephony in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X