వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్ కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఊరట: శిక్ష ఏడేళ్లకు తగ్గింపు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం కదులుతున్న రైలులో అత్యాచారానికి గురై, ఆ తర్వాత రైలు నుంచి తోసివేయబడి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సౌమ్య కేసు గుర్తుందా? ఈ కేసులో దోషిగా తేలిన గోవిందచామి అనే వ్యక్తికి కింది కోర్టులు మరణ శిక్ష విధించగా, దానిని ఏడేళ్లకు జైలు శిక్షకు తగ్గిస్తూ సుప్రీం కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది.

 Soumya rape and murder case: SC commutes convict's death sentence to 7 years

ఈ కేసుని ఒక్కసారి పరిశీలిస్తే... కేరళ రాజధాని కొచ్చిలోని ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేసే సౌమ్య (24) 2011, ఫిబ్రవరి 1న రైలులో అత్యాచారానికి గురైంది. కేరళకు చెందిన సౌమ్య ఎర్నాకులం నుంచి త్రిశూర్‌కు రైలులో వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. రైలులోని మహిళా బోగీలో ఒంటరిగా ప్రయాణిస్తున్న సౌమ్యపై గోవిందచామి అత్యాచారం చేశాడు.


అనంతరం కదులుతున్న రైలు నుంచి ఆమెను కిందకు తోసేశాడు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 6న సౌమ్య మృతి చెందింది. ఈ కేసులో గోవిందచామి దోషిగా తేలడంతో 2012లో త్రిశూర్‌లోని ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు గోవిందచామికి మరణశిక్ష విధించింది.

ఈ తీర్పును కేరళ హైకోర్టు కూడా సమర్థించి నిందితుడి మరణశిక్షను ఖరారు చేసింది. ఈ క్రమంలో కింది కోర్టుల తీర్పుపై నిందితుడు గోవిందచామి సుప్రీం కోర్టుని ఆశ్రయించగా, గురువారం దీనిపై విచారణ జరిగింది. బాధితురాలు సౌమ్యపై గోవిందచామి అత్యాచారం చేశాడని ప్రాసిక్యూషన్‌ రుజువుచేసింది.

అయితే కుదలుతున్న రైలు నుంచి ఆమెను తోసేశాడని నిరూపించడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో హత్య కేసును పరిగణనలోనికి తీసుకోని సుప్రీం అతడికి మరణశిక్షను తగ్గించింది. అలాగే అత్యాచారం కేసు కింద గోవిందచామికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించింది.

ఇదిలా ఉంటే ఈ కేసులో ఇప్పటికే అతడు ఐదు సంవత్సరాల ఏడు నెలల జైలుశిక్షను పూర్తిచేసుకున్నాడు. తాజాగా సుప్రీం తీర్పుతో మరో 16 నెలల్లో జైలు నుంచి విడుదల కానున్నాడు.

English summary
The Supreme Court set aside the death sentence given to Govindachamy the convict in the Soumya rape and murder case and reduced it to seven year jail term on Thursday. The convict, who was held guilty of rape, was given death sentence by the lower courts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X