జయలలిత ఎస్టేట్ లో హత్య: శశికళ బంధువులపై అనుమానం ! వరుసగా ఇలానా ?
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కొడనాడు ఎస్టేట్ లో సెక్యూరిటీ గార్డు ఓం బహుదూర్ హత్య కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. కొడనాడు ఎస్టేట్ హత్య కేసులో ఉన్న ప్రధాన నిందితులు వరుస ప్రమాదాలతో మరణించడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
జయలలిత మాజీ కారు డ్రైవర్ కనకరాజ్ అలియాస్ కనగరాజ్ స్వయంగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి సొంత ఊరు (ఎడప్పాడి, సేలం జిల్లా) సమీపంలోనే రోడ్డు ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో మరణించడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అందుకే అనుమానం
జయలలిత కొడనాడు ఎస్టేట్ లో ఏప్రిల్ 24వ తేదీ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో జయలలిత మాజీ కారు డ్రైవర్ కనకరాజ్ రెండు రోజుల క్రితం సేలం జిల్లాలోని ఎడప్పాడి నియోజక వర్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

కేరళలో అదే రోజు
జయలలిత కొడనాడు ఎస్టేట్ లో హత్య జరిగిన తరువాత ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నిందితుడు సయన్ కేరళలోని తిరుచ్చూర్ సమీపంలో ప్రమాదానికి గురై ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.

అనేక అనుమానాలు
జయలలిత కొడనాడు ఎస్టేట్ లో హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు వరుసగా రోడ్డు ప్రమాదాలకు గురికావడంతో అనేక అనుమానాలు ఎదురౌతున్నాయి. ఈ కారణాలతో ఏదో జరుగుతోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారి సంఖ్య అధికం అయ్యింది.

వీటి కోసం హత్యా ?
జయలలిత కొడనాడు ఎస్టేట్ లో జయ, శశికళ గదుల తాళాలు పగలగొట్టి విలువైన వస్తువులు, నగదు, నగులు, పత్రాలు చోరీ అయ్యాయని వార్తలు వచ్చాయి, అయితే కొడనాడు ఎస్టేట్ లోని బంగ్లాలో ఐదు వాచ్ లు, ఓ విగ్రహం చోరీ అయ్యిందని నిలగిరి జిల్లా ఎస్పీ మరళీ రంభ మీడియాకు చెప్పడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

టోల్ గేట్ లోని సీసీ కెమెరాల్లో
కొడనాడు ఎస్టేట్ లో జరిగిన హత్య కేసులో పోలీసులకు ఎలాంటి క్లూ చిక్కలేదు. చివరికి టోల్ ప్లాజాల్లోని సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు పలు ఆధారాలు సేకరించి నిందితులను గుర్తించారు ఇప్పటి వరకు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో మరి కొందరు అనుమానాస్పదస్థితిలో మరణించడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

శశికళ కుటుంబ సభ్యులు
జయలలిత కొడనాడు ఎస్టేట్ లో జరిగిన హత్య కేసులో శశికళ నటరాజన్ కుటుంబ సభ్యుల హస్తం ఉందని అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తమిళనాడు ప్రజలు అంటున్నారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కొడనాడు ఎస్టేట్ వ్యవహారాలు ?
జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ వ్యవహారాలు చూస్తున్నది ఎవరు ? అనే విషయం ఇప్పటికీ పోలీసులు బయటకు చెప్పడం లేదు. జయలలిత మరణించిన తరువాత ఎస్టేట్ వ్యవహారాలు ఎవరు చూస్తున్నారు ? అక్కడ జరిగిన హత్యకు ఎవరితో సంబంధం ఉంది ? అని పోలీసు అధికారులు మాత్రం కచ్చితంగా బయటకు చెప్పడం లేదు అనే ఆరోపణలు ఉన్నాయి.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications